Marmayogi: అందరూ అలా అనుకున్నారు.. కానీ..
ABN , First Publish Date - 2023-02-26T11:34:41+05:30 IST
జూపిటర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘మర్మయోగి’ (22-02-1964) చిత్రంలోనిది ఈ స్టిల్. తమిళంలో ఇదే సంస్థ నిర్మించిన ఈ మూవీని తెలుగులోనూ రీమేక్ చేసింది.
జూపిటర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘మర్మయోగి’ (22-02-1964) చిత్రంలోనిది ఈ స్టిల్. తమిళంలో ఇదే సంస్థ నిర్మించిన ఈ మూవీని తెలుగులోనూ రీమేక్ చేసింది. తమిళంలో ఎం.జి.ఆర్ (MGR), మాధురీ దేవి (Madhuri Devi) పోషించిన పాత్రల్ని తెలుగులో ఎన్.టి.రామారావు (NT RamaRao), కృష్ణకుమారి (Krishna Kumari) పోషించారు. ఎన్.టి.రామారావు కథానాయకుడైన ప్రభాకర్ పాత్రలో వీరోచితంగా నటించారు. తిరుగుబాటు వీరుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఛత్రపతి శివాజీ (Chatrapathi Sivaji) వేషంలో ఎన్.టి.ఆర్. ఈ సినిమాలో అధికభాగం కనిపిస్తాడు.
ఇవి కూడా చదవండి:
NTR: కొడుకు కలెక్టరు.. తండ్రి బంట్రోతు
NTR-Bhanumathi: ఒకే సినిమా.. రెండు అర్ధ శతదినోత్సవాలు
అయితే ప్రేక్షకులు ఆయన శివాజీ గెటప్ చూసి ఇది శివాజీకి చెందిన కథేమోనని భ్రమించారు అప్పట్లో. కానీ అది కేవలం వేషం మాత్రమే! సాహస యువకునిగా కాంతారావుతో ‘‘ఇప్పుడు నీ ఎదురుగానే వున్నాను. చేవ వుంటే బంధించు. నన్ను పట్టేవాడింకా పుట్టనే లేదు’’ అని సంభాషించే సన్నివేశంలో ఆయన నటన వీరోచితం. కత్తియుద్ధాలు, కుస్తీలు, దివిటీలతో జరిపిన పోరాటం, పులిగోళ్ల చేతి తొడుగులతో సాగించిన భీకర పోరాటం అన్నగారి అభిమానుల్ని బాగా ఆకర్షించాయి. కృష్ణకుమారితో ‘రావాలి రావాలి రమ్మంటే రావాలి’ పాటలో రామారావు కురిపించిన వలపు భావనకి అప్పట్లో విపరీతమైన ప్రశంసలు దక్కాయి.