Marriage: కట్నం కాదండోయ్.. మేనమామ చదివింపులే ఏకంగా రూ.1.31 కోట్లు.. పెళ్లిలో వరుడిపై కనకవర్షం..!
ABN , First Publish Date - 2023-11-29T15:31:28+05:30 IST
పెళ్లిలో మేనమామ ఇచ్చిన కానుకలు చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. పెళ్లి వేదిక వద్దకు హనుమాన్ రామ్ డబ్బు మూటలతోనూ, బంగారంతోనూ వచ్చాడు. అందరూ చూస్తుండగా పీటల మీద కూర్చున్న వరుడికి అందించాడు. ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Weddings) సీజన్ నడుస్తోంది. పెళ్లి అనగానే కోలాహలం, విందులు, సందడి సర్వసాధారణమే. అయితే తాజాగా రాజస్థాన్ (Rajasthan)లో జరిగిన ఓ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. పెళ్లి అన్నాక బంధువులు, స్నేహితులు వధూవరులకు తమ శక్తికొలదీ బహుమతులు ఇస్తారు. మరికొందరు డబ్బులు చదివిస్తారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లిలో ఓ వ్యక్తి తన మేనల్లుడి పెళ్లికి (Nephew Marriage) ఏకంగా రూ.1.31 కోట్లు చదివించాడు. పెళ్లి వేదిక వద్దకు లక్షల రూపాయల డబ్బుల మూటలతో వచ్చాడు (Viral News).
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా ధర్నావాస్ గ్రామానికి చెందిన రాంకేశ్ అనే వ్యక్తి కుమారుడు జితేంద్ర వివాహం సోమవారం పూజతో జరిగింది. ఈ వివాహానికి వచ్చిన జితేంద్ర మేనమామ హనుమాన్ రామ్ భారీగా కానుకలు ఇచ్చాడు. మొత్తం రూ.1.31 కోట్ల విలువైన కానుకులు (Wedding gifts) ఇచ్చాడు. అందులో రూ.21 లక్షల నగదు, రూ.75 లక్షల విలువైన ఇల్లు, లగ్జరీ కారు, లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఈ బహుమతులన్నీ హనుమాన్ రామ్ తన సోదరి మంజులకు, మేనల్లుడికి అందించారు. జితేంద్ర పస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
School Bus: 4 నెలల క్రితమే బడిలో చేర్చారు కానీ.. ఈ 5 ఏళ్ల బాలుడు ఎలా చనిపోయాడో తెలిస్తే..!
పెళ్లిలో మేనమామ ఇచ్చిన కానుకలు చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. పెళ్లి వేదిక వద్దకు హనుమాన్ రామ్ డబ్బు మూటలతోనూ, బంగారంతోనూ వచ్చాడు. అందరూ చూస్తుండగా పీటల మీద కూర్చున్న వరుడికి అందించాడు. ఈ పెళ్లి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.