Viral: భారత పర్యటనకు వచ్చిన అమెరికా మహిళ.. మనోళ్ల తీరుతో చిర్రెత్తుకొచ్చి.. చివరకు తనే స్వయంగా..
ABN , First Publish Date - 2023-11-18T21:07:13+05:30 IST
తాజ్‌మహల్ పరిసరాలు చెత్తచెదారంతో నిండిపోవడం భరించలేకపోయిన అమెరికా మహిళ తానే స్వయంగా శుభ్రం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తాజ్‌మహల్(Tajmahal).. పాలరాతితో చేసిన ఈ కట్టడాన్ని చూసిన వారెవరైనా ముగ్ధులవ్వాల్సిందే. కానీ, కాస్త చూపు పక్కకు తిప్పి పరిసరాల్ని తెలిపారా చూస్తే మాత్రం చిరాకు రాకమానదు. దీనికి కారణం అక్కడున్న చెత్తాచెదారమే. ఇటీవల తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన ఓ అమెరికా మహిళకు(US woman) కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇది చాలదన్నట్టు అక్కడున్న వారు ఇష్టారీతిన చెత్త వేయడం(Littering) ఆమె గమనించింది.
Viral: షాకింగ్ వీడియో! భర్త వద్ద బైక్ నేర్చుకుంటున్న మహిళ..అతడు వెనక నుంచి అరుస్తున్నా వినకుండా..
తన బాధ్యతగా కొందరిని వారించింది కూడా! అందమైన తాజ్‌మహల్ పరిసరాల్ని చెత్తతో నింపొద్దంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కొందరు తన మాట విని వెళ్లిపోయినా ఆ తరువాత వచ్చిన వారు ఇదే విధంగా చెత్త చేయడం ప్రారంభించారు.
Mohammed Shami: మహ్మద్ షమీని అరెస్టు చేయవద్దు.. ఢిల్లీ పోలీసులు ముంబై పోలీసుల ట్వీట్
Trees on Dividers: రోడ్డుకు మధ్యలో చెట్లు ఎందుకు పెంచుతారో తెలిస్తే..
ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన ఆమె తనే స్వయంగా రంగంలోకి దిగింది. అక్కడున్న చెత్త, వాడిపారేసిన ప్లాస్టిక్ బ్యాగులను తీసి పక్కనే ఉన్న చెత్తబుట్టలో వేసింది. అలా చేయగలిగినంత చేసిన ఆమె చివరకు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ లోపు మనోళ్లు కొందరు ఆమె ఫొటో తీసి నెట్టింట పెట్టడంతో వైరల్‌గా మారింది. మరోవైపు ఘటనపై ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా స్పందించారు. తాజ్‌మహల్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Viral: ఇబ్బందుల్లో ఉన్న పందికొక్కు.. చూసి తట్టుకోలేకపోయిన కాకి.. చివరకు.. నెట్టింట వీడియో వైరల్!
Viral: ఎందుకిలా..? రైతు వీడియో చూసిన కన్‌ఫ్యూజన్‌లో ఆనంద్ మహీంద్రా ప్రశ్న! జరిగిందేంటంటే..