20 ఏళ్ల యువతి బలవన్మరణం.. ఇల్లంతా వెతికినా ఏమీ దొరకలేదు కానీ.. ఆమె చేతులపై రాసింది చదివిన కుటుంబ సభ్యులకు..

ABN , First Publish Date - 2023-03-23T18:53:57+05:30 IST

ఇంట్లో వాళ్లందరూ పొలానికి వెళ్లాక బలవన్మరణానికి పాల్పడ్డ యువతి. ఆమె అరచేతిలో రాసుకున్నది చదివి గొల్లుమన్న కుటుంబసభ్యులు..

20 ఏళ్ల యువతి బలవన్మరణం.. ఇల్లంతా వెతికినా ఏమీ దొరకలేదు కానీ.. ఆమె చేతులపై రాసింది చదివిన కుటుంబ సభ్యులకు..

ఇంటర్నెట్ డెస్క్: ఆ రోజు ఇంట్లోని వారందరూ పొలానికి వెళ్లారు. కొన్ని గంటల తరువాత వారు ఇంటికి తిరిగొచ్చేసరికి షాకింగ్ సీన్ కనిపించింది. ఫ్యానుకు ఉరి వేసుకుని వేళాడుతున్న కూతురిని చూసి ఆ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఈలోపు పోలీసులకు సమాచారం అందింది. మృతురాలి ఇంట్లో సూసైడ్ నోట్ కోసం వెతుకుతుండగా పోలీసులు ఏమీ కనిపించలేదు. అయితే.. ఆమె చేతిపై రాసుకున్నది వారి కంటపడటంతో ఒక్కసారిగా అక్కడ సీన్ మారింది. కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాయ్‌బరేలీ(ఉత్తరప్రదేశ్-Rae bareili) జిల్లాకు చెందిన సునితా మౌర్య ఏడాదిగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అతడి పేరు కుల్దీప్. అతడు ఉండేది జగత్‌పూర్ ప్రాంతం. ఇద్దరి మధ్య చుట్టరికం కూడా ఉంది.

ఇదిలా ఉంటే.. హోలీ రోజున బయటకు వెళ్లిన కుల్దీప్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు(Boyfriend dies in accident). నాటి నుంచీ సునితా తీవ్ర దుఃఖంలో కూరుకుపోయింది. బుధవారం ఇంట్లోని వారందరూ పొలానికి వెళ్లినప్పుడు ఆమె బలవన్మరణానికి పాల్పడింది(Girlfriend ends self). దీంతో.. ఇంటికొచ్చి చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. కుల్దీప్ లేకుండా నేను బతకలేను..నన్ను క్షమించండి అంటూ కూతురు తన చేతిమీద రాసుకున్నదన్న విషయాన్ని తెలిసి వారు తీవ్ర మనోవేదనలో కూరుకుపోయారు. ఈ ఉదంతం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

Updated Date - 2023-03-23T18:55:48+05:30 IST