UP: తల్లి బయటకు వెళ్లేదాకా వెయిట్ చేసి యువతి దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న చెల్లెళ్లను..
ABN , First Publish Date - 2023-10-10T16:14:49+05:30 IST
అభ్యంతరకర స్థితిలో ఉన్న తనను చూశారన్న కోపంతో ఓ మహిళ తన ఇద్దరు చెల్లెళ్లకు గొంతుకోసి చంపేసింది. ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కుటుంబవిలువలూ, నైతికత కోల్పోతున్న కొందరు దారుణానికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) ఓ షాకింగ్ ఘటన బయటపడింది. తల్లి బయటకు వెళ్లేంత వరకూ వేచి చూసిన ఓ యువతి ఆపై దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఉన్న తన చెల్లెళ్లు ఇద్దరినీ పొట్టనపెట్టుకుంది(Woman kills two sister for seeing her in objectionable position). పోలీసులు దర్యాప్తులో అసలు జరిగిందేంటో తెలుసుకుని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: బాబోయ్.. ఈ కుక్క మామూలు కాదు.. మహిళ తనను కిస్ చేయగానే..
ఇటావా జిల్లాకు చెందిన ఓ యువతి అభ్యంతరకర రీతిలో ఉండగా ఆమె చెల్లెళ్లు చూశారు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె విషయం బయటకుపొక్కకముందే వారిని అంతం చేయాలని నిశ్చయించుకుంది. సోమవారం తల్లి , ఇతర కుటుంబసభ్యులు గడ్డి కోసుకుతెచ్చుకునేందుకు బయటకు వెళ్లగా యువతి కిరాతకానికి పాల్పడింది. ఏడేళ్లు, ఐదేళ్ల వయసున్న తన ఇద్దరు చెల్లెళ్లను పారతో గొంతు కోసి హత్య చేసింది. ఆ తరువాత చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించింది.
రక్తం అంటిన పారను శుభ్రంగా కడిగేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా, రక్తపు మరకలు ఉన్న తన దుస్తులను కూడా ఉతికి ఇంటి పరిసరాల్లోనే ఆరేసింది. ఈలోపు, తిరిగొచ్చిన తల్లికి ఇంటి తలుపులు తీసి ఉండటం కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా తన ఇద్దరూ కూతుళ్లు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Viral: డాక్టర్ చేతిరాత అర్థంకాక మెడికల్ షాపు సిబ్బంది ఘోర తప్పిదం.. మహిళ జీవితం తలకిందులు..
బాధిత కుటుంబసభ్యుల వివరాలన్నీ నమోదు చేసుకున్న పోలీసులు ఒక్కోవ్యక్తిని విచారిస్తుండగా యువతి తీరు అనుమానాస్పదంగా కనిపించింది. అంతేకాకుండా, ఇంట్లోని పార, ఆరేసి ఉన్న దుస్తులపై కొద్ది పాటి మరకలు ఉన్న విషయం కూడా వారి దృష్టి దాటిపోలేదు. చివరకు వారు యువతిని ప్రశ్నించగా ఆమె తాను చేసిన నేరం గురించి ఒప్పుకోక తప్పలేదు. దీంతో, వారు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.