Vijay: భారీ ధరకు ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లంటే..?
ABN , First Publish Date - 2023-02-01T18:14:42+05:30 IST
సౌతిండియాలోని స్టార్ హీరోల్లో విజయ్ (Vijay) ఒకరు. ఆయన లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ అని వ్యవహరిస్తున్నారు.
సౌతిండియాలోని స్టార్ హీరోల్లో విజయ్ (Vijay) ఒకరు. ఆయన లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ‘విక్రమ్’ (Vikram) వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేశ్ నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో మూవీపై భారీ బజ్ ఉంది. అందుకు తగ్గట్టు గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరే రీతిలో కోట్లలో చేస్తుంది. ఆడియో, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని మూవీ అనౌన్స్‌మెంట్‌కు ముందే అమ్ముడవ్వడం చెప్పుకోదగ్గ విశేషం.
‘దళపతి 67’ కు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అన్ని సినిమాల ఆడియో రైట్స్‌ను సోనీ మ్యూజికే దక్కించుకుంటుంది. అదే బాటలో పయనిస్తూ ‘దళపతి 67’ ఆడియో రైట్స్‌ను ఈ కంపెనే సొంతం చేసుకుంది. మ్యూజిక్ రైట్స్ కోసం ఈ సంస్థ దాదాపుగా రూ.16కోట్లు చెల్లించిందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ రైట్స్‌ను సొంతం చేసుకోవడానికి అనేక కంపెనీలు పోటీ పడినప్పటికి సోనీ మ్యూజిక్ భారీ ధర చెల్లించి వాటిని దక్కించుకుంది. ఓటీటీ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ రూ.160కోట్లు చెల్లించింది. శాటిలైట్ రైట్స్ కోసం సన్ నెట్ వర్క్ రూ.60కోట్లు చెల్లించిందని తెలుస్తోంది. ‘దళపతి 67’ లో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, మిస్కిన్, అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది ఈ షెడ్యూల్ దాదాపుగా నెల రోజుల పాటు కొనసాగనున్నట్టు సమాచారం. ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.