Leo: కోలీవుడ్ హిస్టరీలోనే సంచలనం.. రూ.400కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్..
ABN , First Publish Date - 2023-02-26T16:13:57+05:30 IST
ఖైదీ’ (Kaithi), ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాలను తెరకెక్కిస్తున్నారు.
‘ఖైదీ’ (Kaithi), ‘విక్రమ్’ (Vikram) వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj). సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ‘లియో’ (Leo) కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో కొనసాగుతుంది. చిత్రీకరణ కూడా పూర్తి కాక ముందే ‘లియో’ భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. ‘లియో’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.400కోట్లను దాటనున్నట్టు తెలుస్తోంది.
‘లియో’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.120కోట్లకు కొనుగోలు చేసింది. పాన్ ఇండియాగా రూపొందుతుండటంతో అంత భారీ ధరను చెల్లించింది. శాటిలైట్ రైట్స్‌ను రూ.70కోట్లు చెల్లించి సన్ టీవీ సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్‌ను సోనీ మ్యూజిక్ రూ.18కోట్లకు దక్కించుకుంది. హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ కోసం సోనీ మ్యాక్స్, గోల్డ్‌మైన్స్ పోటీపడుతున్నాయి. ఈ హక్కుల కోసం రూ.30కోట్లను చెల్లించేందుకు ఆ సంస్థలు ముందుకు వచ్చాయి. నాన్ థియేట్రీకల్ రైట్స్ ద్వారా ‘లియో’ దాదాపుగా రూ.240కోట్ల బిజినెస్ చేసింది.
లోకేశ్ చివరి చిత్రం ‘విక్రమ్’ సంచలన విజయం సాధించడంతో థియేట్రీకల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఓవర్సీస్ రైట్స్‌కు రూ.50కోట్లను చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చారు. తమిళనాడు రైట్స్ రూ.75కోట్లు, మలయాళం, తెలుగు రైట్స్ రూ.35కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ రూ.15కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతుంది. ‘లియో’ కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ) నేపథ్యంలో రూపొందుతుంది. ఎల్‌సీయూలో ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలు ఇప్పటికే ఉన్నాయి. ‘లియో’ లో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది.
^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!