Share News

Viral News: 1300 ఏళ్ల క్రితం నాటి మానవ శరీరంపై.. ఈ వింత రాతలేంటి..? ఈ టాటూను చూసి శాస్త్రవేత్తలే అవాక్కవడం వెనుక..!

ABN , First Publish Date - 2023-10-26T19:59:21+05:30 IST

1300 ఏళ్ళ క్రితం ఖననం చేయబడిన మానవ శరీరం పై ఓ టాటూను కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఆ టాటూను డికోడ్ చేసిన తరువాత బయటపడిన నిజమిదే..

Viral News: 1300 ఏళ్ల క్రితం నాటి మానవ శరీరంపై.. ఈ వింత రాతలేంటి..? ఈ టాటూను చూసి శాస్త్రవేత్తలే అవాక్కవడం వెనుక..!

టాటూలు ఈ తరానికి కొత్తేమీ కాదు. ఒకప్పుడు పచ్చబొట్లని పిలుచుకున్నవే ఇప్పుడు టాటూలంటూ హల్చల్ చేస్తున్నాయి. ఈటాటూలను ఒకప్పుడు ముల్లుతోనూ ఆ తరువాత సూదులతోనూ వేసేవారు. ఇప్పుడు టాటూలు వేయడానికి ప్రత్యేకంగా మెషిన్లే వచ్చాయి. అయితే ఈ టాటూలకు సంబంధించి ఓ షాకింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 1300 ఏళ్ళ క్రితం ఖననం చేయబడిన మానవ శరీరం పై ఓ టాటూను కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఆ టాటూను డికోడ్ చేసిన తరువాత వారు ఆశ్చర్యపోతున్నారు.దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

టాటూలు(Tattoo) ఇప్పటి కాలం ఫ్యాషన్. దీనికి ముందు పచ్చబొట్లు ఉండేవి. ఇళ్ళలో బామ్మలు, తాతల చేతులమీద, గడ్డం, నుదురు ప్రాంతాలలో పచ్చబొట్లను గమనించే ఉంటారు. అప్పటికి ఈ పచ్చబొట్లను అంత స్పష్టంగా కూడా వేయకపోవడం కూడా గమనించవచ్చు. కానీ పచ్చబొట్లకు వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్టు ఆధారాలతో సహా స్పష్టమైంది. ఈశాన్య ఆఫ్రికాలో(Northeast Africa) ఒకటైన సూడాన్(Sudan) దేశంలో 1300ఏళ్ల కిందట ఖననం చేయబడిన ఓ వ్యక్తి శరీరంపై(1300 years old body) పచ్చబొట్టును కనుగొన్నారు. ఉత్తర సూడాన్ లోని నైలు నది ఒడ్డు నుండి 9.3మైళ్ళ దూరంలో ఉన్న మజాలీ మొనాస్టరీలో ఈ వ్యక్తి ఖననం చేయబడ్డాడు. పర్ఢ్యూ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ పచ్చబొట్టును కనుగొన్నారు. ఈ పచ్చబొట్టును డీకోడ్ చేయగా అది యేసుక్రీస్తు పేరని వారు నిర్థారించారు. ఈ పచ్చబొట్టు వ్యక్తిగతమైనదని, అతి ఆధ్యాత్మిక ప్రయాణానికి సూచనగా వేయించుకుని ఉండవచ్చని అంటున్నారు.

Viral Video: హర్ష సాయి లాగా ఓ నిరుపేద కుటుంబానికి కట్టలు కట్టలుగా డబ్బులను ఇచ్చాడో యూట్యూబర్.. చివరకు జరిగింది చూస్తే..!



ఈ పచ్చబొట్టులో క్రిస్టోగ్రామ్ అనే పేరు ఉంది. ఇది గ్రీకు అక్షరాలైన 'చి' 'రో' లను కలిపి మోనోగ్రామ్ ను ఏర్పరుస్తుంది. యేసుక్రీస్తు పేరుకు ఇది సంక్షిప్తరూపమని అంటున్నారు. గ్రీకు వర్ణమాలలో మొదటి, చివరి అక్షరాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. క్రైస్తవ మతం నమ్మకం ప్రకారం ఇవి ప్రారంభాన్ని, ముగింపును సూచిస్తాయని తెలిపారు. క్రీ.శ 300సంవత్సరంలో రోమన్ చక్రవర్తి పరిచయం చేసిన ఆల్పా, ఒమెగాలు ఇవేనని కూడా చెబుతున్నారు. ఆ కాలానికే ఇంత లోతైన పచ్చబొట్టు వేయించుకన్నట్టు బయటపడటంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ గా మారింది.

Viral Video: కారుకు ఎదురెళ్లి మరీ.. సైకిల్‌పై ఓ వ్యక్తి రిస్కీ స్టంట్స్.. నడిరోడ్డుపై పిచ్చి వేషాలేస్తే ఇలాగే జరుగుతుందిగా..!


Updated Date - 2023-10-26T19:59:21+05:30 IST