Share News

Viral News: ఆ మూడు గ్రామాలలో వింత ఆచారం.. పెళ్లిలో పెళ్లికొడుకు బదులు..!

ABN , First Publish Date - 2023-12-08T15:54:40+05:30 IST

పెళ్లి అనేది స్త్రీలు, పురుషుల మధ్య జరిగే సాంప్రదాయ వేడుక. స్త్రీ, పురుషులు పెళ్లి ద్వారా భార్యాభర్తలుగా మారి ఈ సృష్టిని నడిపిస్తారు. కానీ ఆ మూడు గ్రామాలలో మాత్రం ఎక్కడా లేని వింత ఆచారం ఉంది.

Viral News:  ఆ మూడు గ్రామాలలో వింత ఆచారం.. పెళ్లిలో పెళ్లికొడుకు బదులు..!

పెళ్లి అనేది స్త్రీలు, పురుషుల మధ్య జరిగే సాంప్రదాయ వేడుక. స్త్రీ, పురుషులు పెళ్లి ద్వారా భార్యాభర్తలుగా మారి ఈ సృష్టిని నడిపిస్తారు. ఎక్కడైనా పెళ్లి జరిగితే వరుడు, వధువు ఇద్దరూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పుల వల్ల ఒకే లింగానికి చెందిన వారు కూడా లింగ మార్పిడి చేసుకుని మరీ పెళ్లి వేడుక చేసుకుంటారు. కానీ ఆ మూడు గ్రామలలో మాత్రం దీనికి విరుద్దంగా జరుగుతుంది. పెళ్లి అయితే స్త్రీలు, పురుషుల మధ్య జరుగుతుంది కానీ తంతు మాత్రం వరుడు చేయడు. ఈ వింత ఆచారానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈ ప్రపంచంలో చాలా వింతలున్నాయి. ఒక్కో మతానికి, కులానికి వింత ఆచారాలు కూడా ఉన్నాయి. ఆయా ఆచారాల ప్రకారమే పెళ్ళిళ్లు(Marriage) అయినా చావుకు సంబంధించిన కార్యక్రమాలు అయినా జరుగుతాయి. గుజరాత్(Gujarat) రాష్ట్రంలోని మూడు గ్రామాలలో పెళ్లితంతు కూడా ఇలాంటి వింతతో కూడుకుని ఉంది. గుజరాత్ రాష్ట్రంలో సుర్ఖేడా, సనాద, అంబల్ గ్రామాలలో గిరిజనులు నివసిస్తారు. వీరికి పెళ్లి విషయంలో వింత సాంప్రదాయాలున్నాయి. స్త్రీలకు, పురుషులకు మధ్య పెళ్లి నిర్ణయమైనా అబ్బాయి మాత్రం పెళ్లి తంతు చేయడు. పెళ్లిరోజు అబ్బాయి షీర్వాణి ధరించి తలపాగా ధరిస్తాడు. వారి సాంప్రదాయం ప్రకారం చేతిలో ఖడ్గాన్ని పట్టుకుంటాడు. కానీ వారు వివాహం జరిగే చోటుకు హాజరు కారు. ఇంట్లోనే ఉండిపోతారు.

ఇది కూడా చదవండి: Viral Video: రోడ్డు పక్కన చెత్త ఏరుకునే వ్యక్తి.. పక్కనే ఓ కుక్క.. ఓ దర్శకుడు అనుమానంతో సీక్రెట్‌గా ఫాలో అయితే..!



పెళ్ళి పందిట్లో పెళ్లి కొడుకు చెయ్యాల్సిన తతంగం అంతా అతని బదులు వధువు చెల్లెల్లు లేదా ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే వారు నిర్వహిస్తారు. వారే వధువు నుదుటన సింధురం పెడతారు, పెళ్లి తంతు పూర్తీ చేస్తారు.ఈ మూడు గ్రామాల ప్రజలు పూజించే పురుష దేవతలు అందరూ బ్రహ్మచారులేనట. అందుకే వారిని గౌరవించానే ఉద్దేశంతో ఏ మగవాడు నేరుగా అమ్మాయి మెడలో తాలి కట్టి వివాహం చేసుకోడు. ఇవన్నీ మూడనమ్మకాలని, ఇలా చేయకుండా నేరుగా వరుడు వధువు మెడలో తాళి కడితే ఏమవుతుందనే ఆలోచనలో ఇద్దరు ముగ్గురు ఈ ఆచారాన్ని అతిక్రమించారు. కానీ అలా చేసినందుకు వారి జీవితంలో సంతోషం కొరవడింది. భార్యాభర్తలు ఎక్కువరోజులు కలిసి ఉండలేకపోయారు. దీంతో అందరూ ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అలా పెళ్లి చేసుకున్నవారి బంధం విచ్చిన్నమైంది.

ఇది కూడా చదవండి: నిమ్మకాయల గురించి మీకు తెలియని నిజాలు..!

Updated Date - 2023-12-08T15:54:41+05:30 IST