Turkey Earthquake: శిథిలాల కింద తమ్ముడికి రక్షణ కవచంలా అక్క.. ఎంతో మందిని కదిలిస్తున్న ఫొటో!
ABN , First Publish Date - 2023-02-07T20:36:45+05:30 IST
టర్కీ (Turkey), సిరియా (Syria)లో సంభవించిన పెను భూకంపం మాటలకు అందని విషాదాన్ని మిగిల్చింది. వేల సంఖ్యలో ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా ఎన్నో వేల మంది చిక్కుకున్నారు.
టర్కీ (Turkey), సిరియా (Syria)లో సంభవించిన పెను భూకంపం మాటలకు అందని విషాదాన్ని మిగిల్చింది. వేల సంఖ్యలో ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా ఎన్నో వేల మంది చిక్కుకున్నారు. ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలు కనబడుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి విషాదకర సమయంలో ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Turkey Earthquake).
భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథాలాల కింద ఏడేళ్ల బాలిక, ఆ బాలిక తమ్ముడు ఇరుక్కుపోయారు. అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్ సపోర్టుగా ఉండడంతో వారు ప్రాణాలతో ఉన్నారు. ప్రాణభయంతో ఎంతో సేపు అలా శిథిలాల కింద పడుక్కుని ఉండిపోయారు. అంతటి భయంకర పరిస్థితుల్లోనూ ఆ ఏడేళ్ల బాలిక తన తమ్ముడి కోసం ఆరాటపడిన తీరు ఎంతో మందిని భావోద్వేగానికి గురి చేస్తోంది. తమ్ముడి తలకు ఆ చిన్నారి తన చిట్టి చేయిని అడ్డుపెట్టి ఉంచింది (Girl protects little brother).
కనిపించకుండా పోయిన భార్య.. కొద్ది నెలల తర్వాత మార్కెట్లో ఓ వ్యక్తి పక్కన ప్రత్యక్ష్యం.. నిలదీసిన భర్తకు ఊహించని షాక్..!
అలా వారిద్దరూ ఆ శిథిలాల కింద ఎంతో సేపు ఉండిపోయారు. తమ్ముడికి ధైర్యం చెబుతూ చిన్నారి అక్క 17 గంటల పాటు తమను రక్షించే వారి కోసం ఎదురు చూసింది. తన తమ్ముడికి ధైర్యం చెబుతూ కాపాడింది. ఈ ఫొటో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆ చిన్నారి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు (Viral Photo).