Viral Tweet: మట్టికుండ సురాహిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్, ట్విట్టర్‌లో చర్చ

ABN , First Publish Date - 2023-05-10T19:33:27+05:30 IST

భారతీయ ప్రత్యేకతలకు ఆనంద్ మహీంద్రా అభిమాని. దేశీయ ఆవిష్కరణల(Desi Innovations) పట్ల ఆయనకు అమితమైన ..

Viral Tweet: మట్టికుండ సురాహిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్, ట్విట్టర్‌లో చర్చ

నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Industrialist Anand Mahindra) సోషల్ మీడియాలో తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ చేసే ఆసక్తికరమైన(Interesting), స్ఫూర్తినిచ్చే(Inspiring), చమత్కారంతో కూడిన ట్వీట్స్(Witty Tweets) నెటిజన్లలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంటాయి. భారతీయ ప్రత్యేకతలకు ఆనంద్ మహీంద్రా అభిమాని. దేశీయ ఆవిష్కరణల(Desi Innovations) పట్ల ఆయనకు అమితమైన ప్రేమ. అంతేకాదు వాటి వాడకాన్ని ఎప్పుడు సమర్థిస్తుంటాడు.

తాజాగా వేసవికాలం దృష్ట్యా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భారత దేశంలో సాంప్రదాయ బద్దంగా నీటిని నిల్వచేసేందుకు వాడే మట్టి కుండలకు(Surahi), రిఫ్రిజిరేటర్‌(Fridge)కు మధ్య ఉన్న తేడాను సునిశితంగా చెబుతూ పోస్ట్ చేశాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

‘‘నిజానికి డిజైన్‌,సౌందర్యం పరంగా సురాహి(కుండ) ఉన్నతమైనది. రిఫ్రిజిరేటర్‌తో పోలిస్తే సురాహి (మట్టితో చేసిన నీటి కుండ) చాలా సరసమైనది. మన్నికైనటువంటి తక్కువ సైజులో, ఎక్కడికంటే అక్కడికి మార్చుకునేలా ఉండే లైట్ వెయిట్ వస్తువు.’’ ఆనంద్ మహీంద్ర తెలిపారు. అంతేకాదు రిఫ్రిజిరేటర్ ధర రూ. 10వేల కంటే ఎక్కువగా ఉంటుంది. దీని నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. దీనికి ప్రత్యేకంగా స్థలం కావాల్సి ఉంటుంది అని రాశాడు. ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్‌ కూడా ఫ్రిజ్ గురించి కాకుండా ‘సురాహి’ గురించి పాడిన పాటను ఆయన హాస్యాస్పదంగా పేర్కొన్నారు.

అయితే ఆనంద్ మహీంద్రా ట్వీట్‌‌తో కొందరు నెటిజన్లు ఏకీభవించారు. మరికొందరు ఇది అసాధ్యమని విభేదించారు.

''సురాహి నీటిని నిల్వ చేయడానికి మాత్రమే. రిఫ్రిజిరేటర్లు చాలా రకాల పనులకు పనికి వస్తుంది. రిఫ్రిజిరేటర్ ఉన్నవారు కూడా సురాహిని కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది నీటి రుచిని పెంచుతుంది ,వేసవిలో చల్లగా ఉంచుతుంది. మేము రెండింటినీ పోల్చలేం సార్,'' అని ఒక యూజర్ రాశారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, ''ఇలాంటి మాటలు మాట్లాడితే నమ్మడం కష్టం. అని రాశాడు.

దానికి ప్రతిస్పందిస్తూ, మిస్టర్ మహీంద్రా ఇలా వ్రాశారు, ''ఇది స్పష్టంగా తేలికైన పోలిక, కాబట్టి భయపడవద్దు, శక్తివంతమైన ఫ్రిజ్ అంతరించిపోయే ప్రమాదం లేదు!''

అయితే, రెండవ వినియోగదారు ఈ పోస్ట్‌తో ఏకీభవించారు. ''గత 16 యేళ్లుగా సురాహిని ఉపయోగిస్తున్నాం. సహజంగా చల్లబడిన నీరును ఇస్తుంది. అంతేకాదు నీటి రుచి మెరుగుపడుతుంది. దగ్గు జలుబు లేదా ఇతర అలెర్జీలు లేవు. చాలాకాలం ఏళ్లుగా ఐస్ తీసుకోవడం మానేశారు. మేం సురాహిని పూర్తిగా ఇష్టపడుతున్నామని '' ట్వీట్ చేశారు.

Updated Date - 2023-05-10T19:42:31+05:30 IST