Menu Anxiety: నేటి యువతలో వింత రుగ్మత..ప్రముఖ రెస్టారెంట్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు..అవేంటంటే..!
ABN , Publish Date - Dec 16 , 2023 | 09:02 PM
జెన్ జెడ్ యువతలో అధిక శాతం మంది మెనూ యాంక్జైటీతో సతమతమవుతున్నట్టు ఓ బ్రిటన్ రెస్టారెంట్ జరిపిన సర్వేలో వెల్లడైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రెండ్స్, బంధువులు, లవర్స్ లేదా జీవిత భాగస్వామితో సాయంత్రం వేళ అలా ఏదైనా రెస్టారెంట్‌లో తిని రావాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఈ మధ్య కొందరు యువత మాత్రం దీనిపై విముఖత చూపుతున్నట్టు బ్రిటీష్ రెస్టారెంట్ చైన్ ప్రెజ్జో గుర్తించింది. మెనూ యాంక్జైటీగా పెరు పడ్డ ఈ సమస్య జెన్ జెడ్ తరంలో ఎక్కువగా ఉందని వెల్లడించింది.
Mustard Oil: మనం ఇష్టంగా తినే ఆవనూనె..ఒకేఒక్క కారణంతో అమెరికాలో నిషేధం.. ఆవనూనెతో ఇంతటి ప్రమాదమా?
తాము ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు ప్రెజ్జో (Prezzo) పేర్కొంది. మొత్తం 2000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే, 1996-2010 మధ్య పుట్టిన వారిలో (Gen Z) ఈ మెనూ యాంగ్జైటీ (Menu Anxiety) ఎక్కువగా ఉందట.
సాధారణంగా రెస్టారెంట్‌లో ఎవరైనా ముందుగా మెనూ చూస్తారు. అందులో నచ్చినది ఎంచుకుని ఆర్డరిస్తారు. అయితే, ఈ మెనూనే యువతలో అధిక ఆందోళనకు కారణమవుతోందని సర్వేలో బయటపడింది. దీంతో, చాలా మంది స్వయంగా ఆర్డరిచ్చే బదులు తమ స్నేహితులకో బంధువులకో ఈ బాధ్యతను అప్పజెపుతున్నారట.
Viral: అమెరికాలో పోలీస్ ఛేజింగ్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. మనకు ఇదే కావాలంటూ కామెంట్!
ఈ మెనూ యాంక్జైటీకి గల కారణాలను కూడా ప్రెజ్జో సంస్థ సీఈఓ వివరించారు. తాము ఆర్డరిచ్చిన వంటకం నచ్చకపోతే చివరకు నిరాశ చెందాల్సి వస్తుందని నేటి యువత భయపడుతోందట. అంతేకాదు, రెస్టారెంట్ చార్జీలు కూడా నానాటికీ పెరుగుతుండటం యువతలో ఆందోళన మరింత పెంచుతోందట. జెనరేషన్ జెడ్ యువతలోనే ఈ ఆందోళన అధికంగా ఉన్నట్టు సంస్థ గుర్తించింది. సర్వేలో పాల్గొన్న 34 శాతం మంది తమకు ఇలాంటి టెన్షన్ ఉందని వెల్లడించారు. ముందుగా మెనూ చూసే అవకాశం దొరికితే తాము అసలు రెస్టారెంట్‌కే వెళ్లకపోవచ్చని కొందరు చెప్పారు. ఈ ఆందోళన కారణంగా యువత రెస్టారెంట్‌లో ఆహ్లాదంగా గడపలేకపోతున్నట్టు ప్రెజ్జో తేల్చింది.