White Hair: తెల్లజుట్టు కవర్ చేయడానికి పదే పదే హెన్నా పెట్టినా పెద్దగా ఫలితం లేదా? ఒక్కసారి హెన్నాలో ఇది కలిపి వాడితే..
ABN , First Publish Date - 2023-10-22T11:29:37+05:30 IST
ఈ ఒక్క టిప్ ఫాలో అయితే హెన్నా రంగు దట్టంగా, నల్లగా ఉంటుంది. తొందరలోనే తెల్లజుట్టు మాయమవుతుంది.
తెల్లజుట్టు అధికశాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్నాపెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతుందిది. తెల్లజుట్టుతో అందరికీ కనిపించాలని ఎవ్వరూ అనుకోరు. అందుకే కొందరు రసాయనాలతో కూడిన హెయిర్ డై లు ఉపయోగిస్తే మరికొందరు ఆరోగ్యకరమైన రీతిలో హెన్నా పెట్టి తెల్లజుట్టును కవర్ చేస్తుంటారు. చాలామంది తెల్లజుట్టు కవర్ చేయడానికి హెన్నా పెట్టినా రంగు ఎక్కువకాలం నిలవకపోవడం వల్ల హెన్నా అంటే కాస్త విసుగు చెందుతారు. అయితే హెన్నా రంగు దట్టంగా, ఎక్కువరోజులు ఉండటానికి ఓ మ్యాజికల్ టిప్ ఉంది. దాన్ని ఫాలో అయితే హెన్నా రంగు ఎక్కువ రోజులు ఉండటమే కాదు, తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారడానికి కూడా తోడ్పడుతుంది. అదేంటో తెలుసుకుంటే..
జుట్టు నల్లగా ఉంటే వారి వయసు సహజంగానే తక్కువగా కనబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తెల్లజుట్టు(White hair) కవర్ చేయడానికి నానా అవస్థలు పడతారు. రసాయనాలున్న హెయిర్ డై కంటే సహజమైన హెన్నా(henna) చాలా ఆరోగ్యకరం. అయితే హెన్నా రంగు ఎక్కువ కాలం నిలవదు. అలా కాకుండా హెన్నా పెట్టుకోవడం వల్ల జుట్టు పర్మినెంట్ గా నల్లగా మారిపోతే భలే ఉంటుంది. కానీ అది సాధ్యం కాదని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడది సాధ్యమే. హెన్నాలో ఆవనూనె(mustard oil), పసుపు(turmeric), మెంతిపొడి(fenugreek powder) కలిపితే మ్యాజిక్ జరుగుతుంది.
Health Tips: ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని రెగ్యులర్ గా తింటుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆవనూనె కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. దీన్ని హెన్నాలో వేసి మిక్స్ చేయాలి. సాధారణంగా హెన్నా ఎలా పెట్టుకుంటారో అలాగే దీన్ని పెట్టుకోవాలి. రెండు గంటల తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. నెలకు ఒక్కసారి దీన్ని ఫాలో అవుతుంటే కొన్ని నెలల తరువాత అసలు జుట్టుకు రంగు వేసుకోవాల్సిన అవసరమే లేకుండా జుట్టు నల్లగా మారిపోతుంది. ఇందులో ఉపయోగించిన ఆవనూనె జుట్టు మందంగా, నల్లగా మారడానికి సహాయపడుతుంది. మెంతి పొడి జుట్టుకు బలాన్ని ఇస్తుంది. కుదుళ్ల లోపలి నుండి జుట్టు నల్లగా మారేలా చేస్తుంది. పొడి జుట్టు(dry hair) ఉన్నవారికి ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. పలుచగా ఉన్న జుట్టు మందంగా కూడా మారుతుంది.