Viral: లాటరీ గెలిచిన వెంటనే భర్తను మార్చేసిన మహిళ.. షాకింగ్ విషయం తెలుసుకున్న మాజీ భర్త ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2023-03-22T18:57:23+05:30 IST
ఎవరికైనా లాటరీ తగిలితే కుటుంబ సభ్యులతో కలిసి తమ సంతోషాన్ని పంచుకుంటారు. ఆ డబ్బులను తమ కుటుంబం కోసం ఖర్చు పెడతారు. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం అత్యంత స్వార్థపూరితంగా వ్యవహరించింది.
ఎవరికైనా లాటరీ (Lottery) తగిలితే కుటుంబ సభ్యులతో కలిసి తమ సంతోషాన్ని పంచుకుంటారు. ఆ డబ్బులను తమ కుటుంబం కోసం ఖర్చు పెడతారు. అయితే థాయ్‌లాండ్‌కు (Thailand) చెందిన ఓ మహిళ మాత్రం అత్యంత స్వార్థపూరితంగా వ్యవహరించింది. రూ.2.9 కోట్ల లాటరీ గెలిచిన వెంటనే తన భర్తను పక్కన పెట్టేసి మరో వ్యక్తిని పెళ్లాడి వెళ్లిపోయింది. తర్వాత విషయం తెలుసుకున్న భర్త ఆమెపై కోర్టుకెక్కాడు. పాపం.. ఆ భర్త కథ తెలుసుకుంటే మాత్రం అతడిపై జాలి కలగడం ఖాయం (Wife Leaves husband).
థాయ్‌లాండ్‌కు చెందిన నారీన్ అనే వ్యక్తి తన భార్య చావీవాన్, పిల్లలతో కలిసి జీవనం సాగించేవాడు. అయితే పెద్ద ఉద్యగి కాకపోవడంతో నారీన్ అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చాలంటే దక్షిణ కొరియా (South Korea) వెళ్లి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. 2014లో తమ పిల్లలతో కలిసి దక్షిణ కొరియాకు వెళ్లిపోయాడు. అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత చావీవిన్ తన పిల్లలతో కలిసి థాయ్‌లాండ్‌కు తిరిగి వెళ్లిపోయింది. నారిన్ మాత్రం సౌత్ కొరియాలోనే ఉండి పని చేస్తూ నెలకు రూ.70 వేలకు పైగా ఇంటికి పంపేవాడు. అయితే థాయ్‌లాండ్‌లో ఉన్న చావీవిన్‌కు ఇటీవల ఓ బంపర్ లాటరీ తగిలింది. ఏకంగా రూ.2.9 కోట్ల రూపాయలు గెలుచుకుంది. అయితే ఆ విషయాన్ని మాత్రం భర్తకు చెప్పలేదు.
Viral: భర్తంటే ఇలా ఉండాలి.. తన భార్యను దోమలు కుడుతున్నాయంటూ ఫిర్యాదు.. వెంటనే స్పందించిన పోలీసులు ఏం చేశారంటే..
ఫిబ్రవరి 25న ఓ పోలీసు అధికారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పట్నుంచి నారీన్ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం మానేసింది. తన భార్య, పిల్లల పరిస్థితి ఏమైందో తెలియక వారం రోజుల క్రితం నారీన్ థాయ్‌లాండ్ తిరిగి వెళ్లాడు. అక్కడ అతడికి షాకింగ్ విషయం తెలిసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని తెలుసుకుని షాకయ్యాడు. వెంటనే తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లాటరీ డబ్బులు తీసుకునేందుకు తనకు కూడా అర్హత ఉందని తెలిపాడు. అయితే ఆ లాటరీ గెలవక ముందు నుంచే తాను నారీన్‌కు దూరంగా ఉన్నానని చెబుతోంది. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాఫ్తు చేస్తున్నారు.