Shocking: భార్యను కష్టపడి టీచర్‌ను చేస్తే స్కూల్ హెడ్‌మాస్టర్‌తో ఎఫైర్.. దినసరి కూలీకి భారీ షాక్
ABN , First Publish Date - 2023-08-31T18:35:44+05:30 IST
తన భార్యను కష్టపడి చదివించి టీచర్ చేసిన ఓ దినసరి కూలీకి భారీ షాక్ తగిలింది. తన పనిచేస్తన్న స్కూల్ హెడ్ మాస్టర్‌తో ఎఫైర్ పెట్టుకున్న ఆమె చివరకు అతడితో వెళ్లిపోయింది. బీహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనానికి దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: టీచర్ కావాలనుకున్న భార్య కోరిక నెరవేర్చేందుకు అతడు ప్రతిక్షణం కష్టపడ్డాడు. తన పొలం అమ్మి మరీ ఆమె చదువుల కోసం ఖర్చు పెట్టాడు(Labourer helps wife become teacher). కానీ ఆమె టీచర్ అయ్యాక భర్తకు ఊహించని షాకిచ్చింది. తాను పని చేసే స్కూల్‌ల్లోని ప్రిన్సిపాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె చివరకు భర్త,పిల్లలను కాదనుకునని అతడితో వెళ్లిపోయింది(Wife elopes with headmaster). బీహార్‌లో(Bihar) ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వైశాలి జిల్లా మహీపుర గ్రామం జన్హడా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే కుమార్ (పేరు మార్చాము) రోజుకూలిగా పొట్టుపోసుకుంటున్నాడు. అతడికి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ జంటది ప్రేమ వివాహం. వారికి 12 ఏళ్ల కూతురు, ఏడేళ్ల కొడుకు ఉన్నారు. ఇదిలా ఉంటే, కుమార్ భార్యకు టీచర్ కావాలనేది చిరకాల వాంఛ. భార్య మనసు అర్థం చేసుకున్న కుమార్ ఆమెను తన లక్ష్యం దిశగా ఎంతగానో ప్రోత్సహించాడు. భార్య చదువుల ఖర్చుల కోసం కొంత పొలాన్ని కూడా అమ్మేశాడు. అతడి కష్టం ఫలించడంతో గతేడాది ఆమె టీచర్‌గా ఉద్యోగం సంపాదించింది.
భార్య పురోగతి చూసి మురిసిపోతున్న తరుణంలో కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆమెకు తన స్కూల్ హెడ్ మాస్టర్‌తో వివాహేతర సంబంధం ఉందని తెలిసి తలకిందులైపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ రోజు కుమార్ భార్య హెడ్ మాస్టర్‌తో కలిసి వెళ్లిపోయింది. మహిళ నిర్ణయం ఆ కుటుంబానికి శరాఘాతంగా మారింది. తల్లి ఇంతపని చేస్తుందని తెలియని ఆ పని హృదయాలు కూడా ముక్కలైపోయాయి. తమకు తల్లి అంటే అస్సలు ఇష్టం లేదంటూ ఆ చిన్నారులు మీడియా వద్ద వాపోయారు.
హెడ్‌మాస్టర్ తరచూ తమ ఇంటికి వచ్చి తల్లిని స్కూలుకు తీసుకెళ్లేవాడని చెప్పుకొచ్చారు. ఓ రోజు తల్లి అతడితో సన్నిహితంగా ఉండగా తాను చూశానని బాలిక చెప్పింది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పినందుకు తల్లి తనపై చేయి చేసుకుందని కూడా వాపోయింది. అయితే, ఇకపై తల్లి తమ ఇంటికి రాకూడదని కోరుకుంటునన్నట్టు ఆ ఇద్దరు పిల్లలు కరాఖండీగా చెప్పేశారు. తల్లి చెడ్డదని ఏడేళ్ల బాలుడు చెపుతున్న దృశ్యం స్థానికులను కదిలించింది. కాగా, తనకు న్యాయం చేయాలంటూ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. భార్య, స్కూల్ ప్రిన్సిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.