Shocking: 37 ఏళ్ల వయసులో కడుపు ఉబ్బెత్తుగా మారడంతో డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. టెస్టులు చేసి చూస్తే..
ABN , Publish Date - Dec 15 , 2023 | 06:14 PM
మహిళ ఉదర భాగంలో పిండం పెరిగిన అరుదైన ఘటన గురించి న్యూఇంగ్లండ్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆమె వయసు 37 ఏళ్లు. ఇటీవల ఓ రోజు ఆమె తీవ్రంగా కడుపునొప్పి మొదలైంది. గతంలో ఎన్నడూ చూడని నొప్పి అది. దీంతో, ఆమె గాబరా పడిపోతూ ఆసుపత్రికి వెళ్లింది. మహిళను పరీక్షించిన డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలాంటిది 1 శాతం మందిలోనే చూస్తామని చెప్పడంతో ఆమె దిమ్మెరపోయింది. ఇటీవల న్యూఇంగ్లండ్ జర్నల్‌లో (New England Journal of Medicine) ప్రచురితమైన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
Mustard Oil: మనం ఇష్టంగా తినే ఆవనూనె..ఒకేఒక్క కారణంతో అమెరికాలో నిషేధం.. ఆవనూనెతో ఇంతటి ప్రమాదమా?
కొన్ని రోజులుగా పొట్ట ఉబ్బెత్తుగా మారుతోందని, నొప్పి కూడా మొదలైందని మహిళ తొలుత డాక్టర్లకు చెప్పుకొచ్చింది. వెంటనే వైద్యులు ఆమెకు స్కానింగ్ చేశారు. అందులో వచ్చిన ఫలితాలు చూసి డాక్టర్లే దిమ్మెరపోయారు. ఆమె గర్భం దాల్చి 24 వారాలు దాటిందని, అయితే పిండం మాత్రం గర్భాశయానికి బదులు ఆమె ఉదరభాగంలో పెరుగుతోందని చెప్పడంతో మహిళ ఆశ్చర్యపోయింది. అబ్డామినల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా (Abdominal Ectopic pregnancy) పిలిచే ఈ గర్భధారణ కేవలం 1 శాతం సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుందని చెప్పారు.
YouTube Ads: యూజర్లలో మార్పును గమనించిన యూట్యూబ్.. యాడ్స్ విషయంలో కీలక చర్యలు!
ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఊహించిన వైద్యులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ఆ తరువాత మరో నాలుగు వారాలకు ఆమెకు శస్త్రచికిత్సతో డెలివరీ చేశారు. 28 వారాలకు పుట్టే బిడ్డలకు బతికే ఛాన్స్ 90 శాతం ఉంటుందని వైద్య శాస్త్రం చెబుతోంది. అదే 24 వారాల తరువాత పుడితే ఆ ఛాన్స్ కేవలం 60 -70 శాతం మధ్యే ఉంటుంది. ఈ నేపథ్యంలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అదృష్టం కలిసి వచ్చి తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ అసాధారణ మెడికల్ కేసు అక్కడి వైద్యుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Viral video: ఇదేందయ్యా..ఇదీ..పెళ్లైన మరుక్షణమే ఈ నవదంపతులు ఊహించని విధంగా..