Mother Love: ఇది కదా అమ్మ ప్రేమంటే.. కూతురిని డిగ్రీ చదివించేందుకు ఈ తల్లి ఎన్ని కష్టాలు పడుతోందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-18T15:25:02+05:30 IST

ఆ మహిళ ఆత్మస్థైర్యం ముందు ఎంత పెద్ద కష్టమైనా తల వంచాల్సిందే.. ఆమె పట్టుదల ముందు ఎవరైనా చిన్నబోవాల్సిందే.. ఆమె నలుగురు పిల్లల తల్లి.. కుటుంబ భారాన్ని మోయలేక భర్త ఎటో వెళ్లిపోయాడు.. నలుగురు పిల్లల్లో ఒక పాప వికలాంగురాలు.. కూలి పనికి వెళ్తే కాని పిల్లలకు తిండి పెట్టలేని పేదరికం.. ఈ కష్టాలేవీ ఆ తల్లిని ఆపలేదు..

Mother Love: ఇది కదా అమ్మ ప్రేమంటే.. కూతురిని డిగ్రీ చదివించేందుకు ఈ తల్లి ఎన్ని కష్టాలు పడుతోందో తెలిస్తే..!

ఆ మహిళ ఆత్మస్థైర్యం ముందు ఎంత పెద్ద కష్టమైనా తల వంచాల్సిందే.. ఆమె పట్టుదల ముందు ఎవరైనా చిన్నబోవాల్సిందే.. ఆమె నలుగురు పిల్లల తల్లి.. కుటుంబ భారాన్ని మోయలేక భర్త ఎటో వెళ్లిపోయాడు.. నలుగురు పిల్లల్లో ఒక పాప వికలాంగురాలు.. కూలి పనికి వెళ్తే కాని పిల్లలకు తిండి పెట్టలేని పేదరికం.. ఈ కష్టాలేవీ ఆ తల్లిని ఆపలేదు.. మిగిలిన ముగ్గురు పిల్లలతో పాటు వికలాంగురాలైన కూతుర్ని కూడా ఎన్నో కష్టాలు పడి చదివించింది. తమిళనాడు (TamilNadu)లోని వెల్లూరు (Vellore) జిల్లాకు చెందిన అనిత అనే మహిళ కథ ఇది.

కుటుంబాన్ని వదిలి భర్త ఎటో పారిపోవడంతో అనిత కూలి పనులకు వెళ్తూ పిల్లలను చదివిస్తోంది. ఆమెకు ఉన్న నలుగురు పిల్లలో గౌరిమణి వికలాంగురాలు. ఆమె నడవలేదు. అయినా గౌరిని కూడా పెద్ద చదువులు చదివించాలని అనిత భావించింది. రోజూ కూతురిని ఎత్తుకుని ఊళ్లో ఉన్న స్కూలుకు తీసుకెళ్లి, తీసుకొచ్చేది. అలా ఊళ్లోనే 5వ తరగతి వరకు చదివించింది. ఆమె గ్రామంలో హైస్కూలు విద్య లేకపోవడంతో 12 కి.మి. దూరంలో ఉన్న టౌన్‌లో జాయిన్ చేసింది ప్రతిరోజూ ఉదయాన్నే లేచి కూతురిని సిద్ధం చేసి బస్సు ఎక్కి టౌన్‌కు వెళ్లి దించేది. తిరిగి వచ్చి కూలి పనికి వెళ్లేది. మళ్లీ సాయంత్రం టౌన్‌కు వెళ్లి కూతురిని ఇంటికి తీసుకొచ్చేది (Inspirational Story).

Viral Video: పోలీసాయన కర్కశత్వం.. ప్లాట్‌ఫామ్ మీద పడుకున్న చిన్న పిల్లాడిపై దౌర్జన్యం.. వైరల్ అవుతున్న వీడియో!

అలా 12వ తరగతి వరకు కూతుర్ని అదే టౌన్‌లో చదివించింది. ఇంటర్ పాసైన గౌరికి వెల్లూరులోని ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ సీటు వచ్చింది. అనిత ఊరుకు వెల్లూరు ఏకంగా 55 కి.మి. అంతదూరం కూతురిని తీసుకెళ్లి, తీసుకురావడం అనితకు కష్టసాధ్యమైన పని. అందుకే తనకు సహాయం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin)ను అనిత వేడుకుంటోంది. తమకు దగ్గర్లో ఉన్న టౌన్‌లో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో తన కూతురికి సీటు ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యమంత్రి తమకు తప్పక సహాయం చేస్తారని అనిత ఆశలు పెట్టుకుంది.

Updated Date - 2023-07-18T15:25:02+05:30 IST