Women's Day 2023: మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కంపెనీ స్పెషల్ ఆఫర్.. మార్చి నెల అంతా మహిళలకు ఉచితంగా..
ABN , First Publish Date - 2023-03-07T14:19:47+05:30 IST
మహిళా దినోవత్సవం(International Women's Day) సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా..
సమాజంలో మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలను పక్కన పెడితే మహిళలను ప్రోత్సహిస్తూ స్వచ్చంద సంస్థలు, కంపెనీలు ఎన్నో పనులు చేపడుతుంటాయి. మార్చి 8వ తేదీన అంతర్జాజీయ మహిళా దినోవత్సవం(International Women's Day) సందర్భంగా ఇలాంటి పనులు మరింత ఊపందుకుంటాయి. వివిధ కంపెనీలు తమ ఉద్యోగినులు, వర్కర్స్ కోసం బహుమతులు ఇవ్వడం, వేతనాలు పెంచడం, బోనస్ లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇలాగే మహిళల కోసం ఐసిఐసిఐ లాంబార్డ్(ICICI Lambard) పెద్ద ప్రకటన చేసింది. దీనికి సంబంధించి వివరాలు పూర్తిగా తెలుసుకుంటే..
ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ(Insurance Company) ఐసీఐసీఐ లాంబార్డ్ మహిళా దినోత్సవ ప్రత్యేకంగా(Women's Day Special) ఓ పెద్ద ప్రకటన చేసింది. మార్చి నెలను మొత్తం విమెన్స్ మంత్(Women's Month) గా జరుపుకుంటామని తెలిపింది. ఇందులో భాగంగా ఈ కంపెనీలో పనిచేసే మహిళలకు ఉచిత వైద్యసేవలు అందిస్తామని పేర్కొంది. వీరు అందించే సేవలు ప్రధాన నగరాల్లో సుమారు 10వేలమంది మహిళలకు సులువుగా అందుబాటులో ఉంటాయట. వీరికి మాత్రమే కాకుండా మహిళా ఏజెంట్లు, బ్రోకర్లకు సమగ్ర శిక్షణా కార్యక్రమం కూడా చేపడతామని ఈ సంస్థ చెప్పింది.
ఐసీఐసీఐ ఏర్పాటు చేసిన ఆరోగ్య సేవలలో(Health Service) భాగంగా థైరాయిడ్(Thyroid), విటమిన్ D & B12, Random blood sugar test,ఐరన్ స్టడీ మొదలైనవి అందుబాటులో ఉంటాయి. ఇవి ఐసీఐసీఐ లాంబార్డ్ టేక్ కేర్ యాప్(ICICI Lambard Take Care App) ద్వారా భారతదేశంలో ప్రధాన నగరాల్లో నివసిస్తున్న మహిళలకు అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా భీమా గురించి సందేహాలు తీర్చడం, సరైన సలహాలు ఇవ్వడం కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాకుండా మరొక ముఖ్య సదుపాయం ఏమిటంటే.. రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్(RSA). దీని ద్వారా నెల మొత్తం మహిళా వాహనదారులకు రోడ్ సైడ్ సర్వీస్ ను అందిస్తుంది. మహిళలు రహదారులలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు బ్రేక్ డౌన్ అవ్వడం, ప్రమాదాలు జరగడం, టైర్ పేలడం, ఇంధనం వృధా కావడం, విద్యుత్ వైఫల్యాలు మొదలైన కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు. అలాంటి వారికి సహాయం చేయడమే ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ ముఖ్య ఉద్దేశం. మహిళలు నెల మొత్తం ఈ సేవలను ఉచితంగా పొందవచ్చని వీరు తెలిపారు. ఈ సహాయం పొందడానికి ఐసీఐసీఐ లాంబార్డ్ కస్టమర్ కేర్ కు కూడా కాల్ చేయవచ్చు. వీరి కస్టమర్ కేర్ నెంబర్ 1800 2666