సాధారణ సైకిల్ చూసిన కంటితో ‘‘క్లైన్ జోహన్నా’’ను చూస్తే ‘‘వామ్మో ఇదేంది రా నాయనా’’ అంటూ గింగిర్లు తిరుగుతూ...

ABN , First Publish Date - 2023-04-01T10:38:10+05:30 IST

క్లైన్ జోహన్నా...ఇది ఒక అందమైన అమ్మాయి పేరు కాదు. ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్(heavy bicycle) పేరని తెలిస్తే విస్తుపోతారు.

సాధారణ సైకిల్ చూసిన కంటితో ‘‘క్లైన్ జోహన్నా’’ను చూస్తే ‘‘వామ్మో ఇదేంది రా నాయనా’’ అంటూ గింగిర్లు తిరుగుతూ...

క్లైన్ జోహన్నా...ఇది ఒక అందమైన అమ్మాయి పేరు కాదు. ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్(heavy bicycle) పేరని తెలిస్తే విస్తుపోతారు. జర్మనీ(Germany)కి చెందిన రికార్డ్ ఇన్‌స్టిట్యూట్.. ఈ క్లైన్ జోహన్నా(Klein Johanna)కు ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్ అనే బిరుదును ఇచ్చింది. ఈ సైకిల్‌ను స్క్రాప్(Scrap) మెటల్‌తో తయారు చేశారు. ఈ సైకిల్ 2 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల పొడవు కలిగి ఉంది.

అయితే దాని బరువు గురించి మీకు తెలిస్తే మీ మైండ్ బ్లాంక్(Mind blank) అయిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత బరువైన ఈ సైకిల్‌ను తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ సైకిల్‌ను తయారు చేయడానికి మొత్తం 2,500 గంటలు పట్టిందని సెబాస్టియన్(Sebastian) గతంలో తెలిపారు. అతను ఈ సైకిల్ తయారు చేస్తున్నప్పుడు, అతని కుటుంబ సభ్యులు అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ అతను తన పట్టుదల వదిలిపెట్టలేదు.

చివరకు ఈ సైకిల్ తయారు చేస్తూనే తుది శ్వాస(last breath) విడిచాడు. త్వరలో ఈ సైకిల్‌ ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌‌లో నమోదు కానున్నదని సమాచారం. సాధారణ హ్యాచ్‌బ్యాక్(hatchback) కార్ల బరువు 700 నుండి 1000 కిలోలు.

అయితే క్లైన్ జోహన్నా బరువు 2,177 కిలోలు. ఈ సైకిల్‌ను జర్మనీలోని సాక్సోనీ-అన్‌హాల్ట్(Saxony-Anhalt) రాష్ట్రంలో నివసించే సెబాస్టియన్ బ్యూట్లర్ రూపొందించారు. సెబాస్టియన్ ఈ సైకిల్‌కు ట్రక్ గేర్ బాక్స్‌(Truck gear box)ను అమర్చారు. క్లాసిక్ సైకిల్ గేర్ సిస్టమ్‌ను కాపీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత బరువైన ఈ సైకిల్‌కు ముందుకు వెళ్లేందుకు 35 గేర్లు, వెనుకకు వెళ్లేందుకు 7 గేర్లు ఉన్నాయి. కేవలం ఒక మనిషి మాత్రమే ఈ సైకిల్‌ను పెడలింగ్(Pedaling) చేయడం ద్వారా నడపగలుగుతాడు.

Updated Date - 2023-04-01T10:57:19+05:30 IST