World's most Expensive Divorce: వామ్మో.. 6 లక్షల కోట్ల భరణమా..? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివంటే..!
ABN , First Publish Date - 2023-08-02T16:46:24+05:30 IST
ధనవంతుల పెళ్ళిళ్లే కాదు, విడాకులు కూడా హాట్ టాపిక్కే.
ధనవంతుల పెళ్ళిళ్లే కాదు, విడాకులు కూడా హాట్ టాపిక్కే. నిజం చెప్పాలంటే ధనవంతుల జీవితాల్లో జరిగే విషయాలు వారి కుటుంబ సభ్యుల కంటే ముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. గాలికంటే వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తాయి. సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడ భర్త సంపాదన, ఆస్తుల ఆధారంగా కోర్టులు భరణాన్ని నిర్ణయిస్తాయి. అదే విధంగా ఓ భార్యాభర్తల జంట విడిపోయినందుకు గానూ భర్త భార్యకు 6లక్షల కోట్లు భరణంగా చెల్లించాడు. కళ్లు భైర్లు కమ్మే ఈ భరణం మొత్తాన్ని అందుకున్న తరువాత సదరు భార్య ప్రపంచంలోని సంపన్నమైన మహిళలల్లో ఒకరిగా స్థానం సంపాదించింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకుల కేసు ఇదే కావడం గమనార్హం. ఇంతకీ 6లక్షల కోట్ల భరణం అందుకున్న ఆ మహిళ ఎవరు? అంత భరణం ఇచ్చిన భర్త ఎవరు? పూర్తీగా తెలుసుకుంటే..
ధనవంతుల(Rich peoples) జీవితాలు చాలా విచిత్రమైనవి. వీరి బంధాలు కూడా చాలా వరకు డబ్బుతో ముడిపడి ఉంటాయి. ప్రపంచానికి మైక్రోసాఫ్ట్(Microsoft) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైక్రోసాప్ట్ సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్స్ గేట్స్(Bill Gates). ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు(one of the richest man). ఈయన పుణ్యమా అని సాధారణ పౌరులకు కూడా కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈయన భార్య మెలిండా గేట్స్(Melinda Gates). వీరిద్దరూ 1994లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. కానీ ఏం జరిగిందో ఏమోకానీ 2021, మే 4వ తేదీన వీరిద్దరూ భార్యాభర్తల బంధం నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వివాహం జరిగిన 27సంవత్సరాల తరువాత ఇలాంటి నిర్ణయమేంటని అందరూ విస్మయం వ్యక్తం చేశారు. కానీ వీరిద్దరు మాత్రం విడిపోవడానికే నిర్ణయించుకుని ఆ మేరకు విడాకులు తీసుకున్నారు కూడా. బిల్ గేట్స్ నికర విలువ దాదాపు 119.4 బిలియన్ డాలర్లు. ఈయన తన భార్య మెలిండాకు విడాకులు ఇచ్చిన సమయంలో ఆమెకు భరణంగా 73బియలిన్ అమెరికన్ డాలర్లు ఇచ్చారు. ఇది భారతీయ కరెన్సీలో 6లక్షల కోట్లకు సమానం(6lakh crores alimony). ప్రపంచంలో అత్యధిక భరణం ఇచ్చిన వ్యక్తి బిల్ గేట్స్ కాగా, అత్యధిక భరణం పొందిన మహిళగా మెలిండా గేట్స్ నిలిచారు.