Yellow Mongoose : ఈ ముంగీసలు పరిసరాలను వాసనతో పసిగడతాయి..!

ABN , First Publish Date - 2023-01-14T11:17:24+05:30 IST

ఈజిప్షియన్ మమ్మీ చేయబడిన సమాధులలో ముంగూస్‌లను ఉంచేవారు.

Yellow Mongoose : ఈ ముంగీసలు పరిసరాలను వాసనతో పసిగడతాయి..!
Yellow mongooses

కోపంలో ఉన్నప్పుడు గంభీరతను ప్రదర్శించే ఈ ముంగీస పేరు ఎల్లో మాంగూస్.. ఈ పసుపు ముంగీసకు ఈ పేరు దాని రంగు నుండి వచ్చింది, ఇది వాస్తవానికి, పసుపు నుండి బూడిద వరకు ఉపజాతుల మధ్య మారుతూ ఉంటుంది. చాలా రకాల సువాసనలను ఉపయోగించి దాని సరిహద్దులను ఏర్ఫరుచుకుంటుంది.. మిగతావాటితో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు తోకను కదిలిస్తూ ఉంటుంది.

ఈ జాతి దక్షిణ ఆఫ్రికా అంతటా అంగోలా, బోట్స్వానా, లెసోతో, నమీబియా, స్వాజిలాండ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా గడ్డి భూములు, గుబురుగా ఉండే పొదలు వంటి ప్రాంతాలలో నివసించడానికి ఇష్టపడుతుంది. పసుపు ముంగిసలు రోజులో ఎక్కువ భాగం ఆహారం కోసం గడుపుతాయి, అయితే కొన్నిసార్లు అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. ఆహారం కోసం ప్రయాణం చేయడానికి బయలుదేరే ముందు వాటి గుహల వెలుపల విశ్రాంతి తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా బొరియలలో నివసిస్తాయి.,

పసుపు ముంగిసలు మాంసాహారులు; ఇవి ప్రధానంగా చీమలు, చెదపురుగులు, మిడుతలు, బీటిల్స్ వంటి కీటకాలను తింటాయి. పక్షులు, కప్పలు, బల్లులు, గుడ్లు, చిన్న ఎలుకలతో పాటు పండ్లు, కాయలు, విత్తనాలను కూడా తింటాయి. పసుపు ముంగిసలు సంతానోత్పత్తి కాలం సాధారణంగా జూలై నుండి సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. గర్భం 42 నుండి 57 రోజుల వరకు ఉంటుంది.

1. పక్షి గుడ్డును పగలగొట్టడానికి, పసుపు ముంగిస కొన్నిసార్లు గుడ్డును ఒక రాయితో పగలగొట్టి తింటుంది.

2. పసుపు ముంగిసలు అద్భుతమైన త్రవ్వకాలు జరుపుతాయి.,వాటి బొరియలు 1.5 మీటర్ల లోతు వరకు ఉండి దాదాపు 40 గదులు వరకూ తవ్వుతాయి. సొరంగాలుగా చేసుకుని నివసిస్తాయి.

3. కొన్ని ప్రదేశాలలో రెడ్ మీర్కాట్ (Red Meerkat) అనేది పసుపు ముంగిసకు మరొక పేరు పురాతన ఈజిప్షియన్లతో సహా కొన్ని పురాతన నాగరికతలు ముంగూస్‌లను గౌరవించేవారు. వీరు తమ ఈజిప్షియన్ మమ్మీ చేయబడిన సమాధులలో ముంగూస్‌లను ఉంచేవారు.

4. ముంగిసలు వాటి భూభాగాలను గుర్తించడానికి, పునరుత్పత్తి స్థితిని సూచించడానికి ఒక రకమైన వాసనను ఉపయోగిస్తాయి.

Updated Date - 2023-01-14T11:26:16+05:30 IST