Marraige: ఒక్కో మనిషికి కోటి రూపాయలు ఖర్చు.. భూమికి, ఆకాశానికి మధ్యలో.. లక్ష అడుగుల ఎత్తులో పెళ్లంటే మాటలా మరి..!

ABN , First Publish Date - 2023-05-19T16:30:40+05:30 IST

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అలాంటి పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిలా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు.

Marraige: ఒక్కో మనిషికి కోటి రూపాయలు ఖర్చు.. భూమికి, ఆకాశానికి మధ్యలో.. లక్ష అడుగుల ఎత్తులో పెళ్లంటే మాటలా మరి..!

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి (Marriage) అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అలాంటి పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిలా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ మార్కెట్ ఇటీవలి కాలంలో బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారిపోయింది. సంవత్సరానికో కొత్త ఐడియాతో వెడ్డింగ్ ప్లానర్లు ముందుకు వస్తున్నారు. ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) బాగా పాపులర్ అయింది.

కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడమే డెస్టినేషన్ వెడ్డింగ్. కొంతమంది బీచ్‌లు ఉన్న ప్రాంతాల్లో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. మరికొంత మంది పర్వత ప్రాంతాల్లో తాళి కట్టాలనుకుంటారు. ఒకవేళ ఎవరైనా అంతరిక్షంలో (Space) పెళ్లి చేసుకోవాలనుకుంటే? వారి కోసం ఓ సంస్థ ముందుకొచ్చింది. భూమికి లక్ష అడుగుల ఎత్తులో, అంతరిక్షంలో పెళ్లి వేదికలను ఏర్పాటు చేసింది. స్పేస్ పెర్స్‌పెక్టివ్ (Space Perspective) అనే సంస్థ ఈ అసాధారణ ఐడియాకు రూపకల్పన చేసింది.

Cadbury Dairy Milk: డైరీ మిల్క్ చాక్లెట్స్ కవర్ల కలర్ వెనుక ఇంత కథ జరిగిందా..? పోటీగా మరో కంపెనీ కేసు వేస్తే..!

కార్బన్-న్యూట్రల్ బెలూన్ ద్వారా వీరు వధూవరులను అంతరిక్షంలోకి పంపిస్తారు. ఆ బెలూన్‌లను పెద్ద పెద్ద కిటికీలతో భూమి మొత్తం కనిపించేలా డిజైన్ చేశారు. ఆ స్పేస్ షిప్ పేరు నెఫ్ట్యూన్ (Neptune). దీనిలో పైలెట్‌తో పాటు ఒకేసారి 8 మంది ప్రయాణం చేయవచ్చట. భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తుకు చేరుకుని, వివాహం పూర్తయ్యాక తిరిగి కిందకు రావడానికి నెఫ్ట్యూన్‌కు ఆరు గంటల సమయం పడుతుంది. వచ్చే ఏడాది నుంచి ఈ స్పేస్ వెడ్డింగ్‌లను (Space Wedding) లాంఛ్ చేయాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే అంతరిక్షంలో వివాహాలు చేసుకునేందుకు వెయ్యి మంది టికెట్లు కూడా కొనేశారట. అయితే అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ఒక్క వ్యక్తి రూ.కోటి చెల్లించాలట.

Updated Date - 2023-05-19T16:30:40+05:30 IST