ఎన్ని ప్రయత్నాలు చేసినా పెదవుల మీద నలుపు పోవట్లేదా? మీకే తెలియకుండా చేస్తున్నఈ తప్పుల వల్లే..
ABN , First Publish Date - 2023-05-10T13:06:40+05:30 IST
ఎన్ని టిప్స్ పాటించినా నలుపు తగ్గడం లేదంటే ఇదిగో అందరూ చేస్తున్న పొరపాట్లు ఇవే..
అందమైన పెదవులు(beautiful lips) ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇప్పటి కాలం అమ్మాయిలు లిప్ స్టిక్(lip stick) వేసి పెదాలను కవర్ చేస్తుంటారు. కానీ పెదవులు సహజంగా ఎర్రగా గులాబీ రేకుల్లా ఉండటం చాలా అరుదు. లిప్ బామ్(lip balm), కొబ్బరి నూనె(coconut oil), వేజిలైన్(Vaseline) ఇలా ఎన్ని అప్లై చేసినా పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చాలామంది అమ్మాయిలకు పెదవుల చుట్టూ నలుపు(black around lips) తిష్టవేసుకుని కూర్చుంటుంది. అవి పొగొట్టడానికి ఎన్ని టిప్స్ పాటించినా అవి తగ్గడం లేదంటే ఇదిగో అందరూ చేస్తున్న పొరపాట్లు ఇవే..
పెదవుల మీద చర్మం సున్నితంగా(Lip skin too sensitive) ఉంటుంది. చలికి(cool), ఎండవేడిమికి(sun hot) పెదవులు కమిలినప్పుడు, పగిలినప్పుడు వాటిని ఇబ్బంది పెట్టకూడదు. చాలామంది రబ్ చేయడం, పెదవుల మీద లేచిన చర్మపు పొరను లాగడం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతం నల్లగా మారి మచ్చలు ఏర్పడతాయి. మరికొందరు పగిలిన పెదవుల మీద గాఢత కలిసిన ఆయిల్స్, లిప్ స్టిక్ అప్లై చేస్తారు. పగిలిన పెదవులకు స్క్రబ్(scrub) చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి పెదవులను ఇబ్బంది పెట్టకూడదు.
Viral Video: బాబోయ్ ఈవిడేం భార్యండీ బాబూ.. డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన భర్త పట్ల ఈమె దారుణం చూస్తే భయపడతారు..
చాలామంది పెదవులను మాటిమాటికి నాలుకతో తడుపుకుంటూ(licking lips) ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పెదవులు ఎక్కువగా పొడిబారతాయి(lips become too dry). పెదవులు పొడిబారుతున్నాయనే ఇలా తడుపుకుంటున్నప్పటికీ అది మరింత సమస్యను పెంచుతుంది. పెదవులు ఎంత తొందరగా పొడిబారితే అంత తొందరగా నలుపెక్కుతాయి. దీన్ని నివారించడానికి మంచినీళ్లు బాగా తాగాలి తప్ప పెదవులు తడుపుకోవడం మంచిదికాదు.
ప్రతిరోజూ లిప్ బామ్(lip balm) రాసే అలవాటు ఉన్న మహిళలు లిప్ బామ్ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అట్రాక్షన్ గా ఉన్నాయని, చీప్ గా లభిస్తున్నాయని ఏవంటే అవి యూజ్ చేయకూడదు. సల్పర్ ఫ్రీ లిప్ బామ్(sulfur free lip balm) లు పెదవులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటివి మాత్రమే కొనుగోలు చేయాలి. వైట్ పెట్రోలియం జెల్లీ(white petroleum jelly), బీట్రూట్ రసం(beetroot juice), కొబ్బరి నూనె(coconut oil) ఉపయోగించి ఇంట్లోనే లిప్ బామ్(home made lip balm) తయారుచేసుకుని వాడితే మరీ మంచిది.
పెదవులను కొరికే అలవాటు(lip biting habit) ఉన్నవారికి పెదవుల చుట్టూ నలుపు ఎక్కువగా ఉంటుంది. ఏదో ఆలోచిస్తున్నప్పుడో, చిరాగ్గా, కోపంగా ఉన్నప్పుడు పెదవులు కొరుకుతూ ఉండటం వల్ల పెదవుల చుట్టూ నలుపు చేరుతుంది. పదే పదే ముక్కును, పెదవులను చేతులతో తాకుతూ ఉన్నవారికి ఇలా పెదవులు నల్లగా ఉండే సమస్య అధికంగా ఉంటుంది. ఈ తప్పులన్నీ చేస్తూ ఎన్ని టిప్స్ పాటించినా పెదవులు ఎర్రగా గులాబీ రెక్కల్లా మారవు.