Shakti: ఎస్తర్ ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు

ABN , First Publish Date - 2023-02-25T16:09:41+05:30 IST

'సిల్క్ మిల్క్' (#SilkMilkSong) చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. త్వరలో విడుదల అవుతున్న ఈ సినిమాలో ఎస్తర్ (#Ester) చాలా గ్లామర్ గా కనువిందు చేసింది. అలాగే ఎస్తర్ నటించిన అన్నీ సినిమాల్లో కొంచెం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 'శక్తి' (#Shakti) అనే సినిమాలో ఆమెని చూస్తే షాక్ అవుతారు అందరూ.

Shakti: ఎస్తర్ ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు

తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో బాగా బిజీ గా వున్న నటి ఎస్తర్(Ester). ఈమధ్య ఆమె నటించిన 'ఇనాందార్' (Inamdar) అనే సినిమాలో పాట 'సిల్క్ మిల్క్' (#SilkMilkSong) చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. త్వరలో విడుదల అవుతున్న ఈ సినిమాలో ఎస్తర్ (#Ester) చాలా గ్లామర్ గా కనువిందు చేసింది. అలాగే ఎస్తర్ నటించిన అన్నీ సినిమాల్లో కొంచెం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 'శక్తి' (#Shakti) అనే సినిమాలో ఆమెని చూస్తే షాక్ అవుతారు అందరూ. అప్పుడు గ్లామర్ గా కనిపించిన ఆ ఎస్తర్ ఆలా ఎలా అంతలా మారిపోయింది అని అనిపిస్తుంది.

ester-new3.jpg

ఇది పూర్తిగా మహిళలకు సంబదించిన సబ్జెక్టు, ఇది తనకు మనసుకు హత్తుకునే కథ అని అందుకనే ఈ సినిమా చేస్తున్నాను అని చెప్తోంది ఎస్తర్. దర్శకుడు కి చాలా మంచి పేరు వస్తుంది, అలాగే అతను ఇలాంటి ఒక మంచి కథ తో వచ్చినప్పుడు ఆ దర్శకుడికి సపోర్ట్ చెయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమా ఒప్పుకున్నాను అని అంటోంది ఎస్తర్. దానికి తోడు ఈ సినిమా 'మార్చి 8' (#WomensDay) మహిళా దినోత్సవం నాడు విడుదల అవుతోంది, అది కూడా చాలా బాగా నచ్చింది.

ester-new2.jpg

మనం ఎప్పుడూ వింటూ వుండే మాట 'హీరో'. ప్రతి వాళ్ళు తన తండ్రే తమకి హీరో అని చెపుతూ వుంటారు. కానీ ఎస్తర్ ఏమంటుంది అంటే, ప్రతి స్త్రీ లో కూడా ఒక హీరో ఉంటాడు అని అంటుంది. ఒక అమ్మ లో, అమ్మమ్మ లో, చిన్న పాప లో కూడా హీరోయిజం ఉంటుంది. ఒక గొప్ప పదవిలోనో, లేదా ధనవంతురాలో కాకుండా ఒక హౌస్ వైఫ్, ఒక సామాన్య స్త్రీ కూడా పోరాట పటిమ కనిపిస్తే ఆమె కూడా ఒక హీరో అవుతారు అని ఎస్తర్ చెప్పింది. అందుకనే ఈ 'శక్తి' సినిమాలో ఈ రోల్ చేశాను అని చెప్తోంది.

ఇది ఒక సినిమా లో ఒక రోల్ చేస్తున్నాను అని కాకుండా, ఒక బాధ్యత గల స్త్రీ గా చేశాను ఈ పాత్రనిester-new1.jpg. షూటింగ్ చేసేటప్పుడు, డబ్బింగ్ చేసేటప్పుడు చూసాను, చాలా బాగా వచ్చింది. స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి బేధాలు లేకుండా, అంటే నేను ఎక్కువ, నువ్వు తక్కువ లాంటి బేధాలు లేకుండా, సమానంగా చూడగలిగిన నాదే సమాజం బాగుపడుతుంది అని చెప్పే ఒక మంచి ఆలోచనాత్మక సినిమా ఇది. అందరూ చూడాల్సిన, ముఖ్యంగా యువత చూడాలి అని నేను అనుకుంటున్నా అని చెప్తోంది ఎస్తర్. దీనికి అనిసెట్టి సూర్యప్రకాష్ రెడ్డి దర్శకుడు, మాటలు కూడా రాసాడు.

Updated Date - 2023-02-25T16:09:42+05:30 IST