Share News

YouTube Ads: యూజర్లలో మార్పును గమనించిన యూట్యూబ్.. యాడ్స్ విషయంలో కీలక చర్యలు!

ABN , Publish Date - Dec 15 , 2023 | 04:19 PM

టీవీలో యూట్యూబ్ ప్రేక్షకుల కోసం యాడ్స్ విధానంలో కీలక మార్పులు చేసిన యూట్యూబ్

YouTube Ads: యూజర్లలో మార్పును గమనించిన యూట్యూబ్.. యాడ్స్ విషయంలో కీలక చర్యలు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ప్రతిఒక్కరికీ పరిచయం ఉన్న పేరు బహుశా యూట్యూబ్‌యే నేమో! వినోదం, విజ్ఞానం ఇలా ఎవరికి నచ్చిన కంటెంట్ వారికి అందిస్తుంది యూట్యూబ్. అయితే, యూట్యూబ్‌ వినియోగదారులను ఇబ్బంది పెట్టే ఒకే ఒక అంశం యాడ్స్. ఈ విషయంలో యూజర్ల ఫీడ్‌బ్యాక్ పరిగణలోకి తీసుకున్న గూగుల్.. టీవీ యూట్యూబ్ ప్రేక్షకుల కోసం ఓ కొత్త విధానాన్ని డిజైన్ చేసింది. ఇందులో భాగంగా యాడ్స్ సంఖ్య కుదించి వాటి నిడివిని పెంచేందుకు నిర్ణయించింది. అంతేకాకుండా, వీడియో అక్కడక్కడా యాడ్స్ ప్రదర్శించే బదులు అన్నీ ఒకేచట గంపగుత్తగా చూపించే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. అధిక నిడివిగల వీడియోలకు వర్తించేలా ఈ మార్పులు చేసింది(Youtubes policy change for ads in TV).

టీవీ యూట్యూబ్ ప్రేక్షకుల సౌకర్యం కోసం పలు కొత్త ఫీచర్లను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా.. ఇంకా ఎంతసేపు యాడ్స్ చూడాలి? ఎప్పుడు యాడ్ స్కిప్ చేసుకోవచ్చు అనే సమాచారాన్ని అందుబాటులోకి తెనుంది. యాడ్ విధానాల్లో పారదర్శకత పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Viral video: ఇదేందయ్యా..ఇదీ..పెళ్లైన మరుక్షణమే ఈ నవదంపతులు ఊహించని విధంగా..


టీవీల్లో యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా యాడ్స్ ప్రారంభించే యోచనలో గూగుల్ ఉంది. ఇటీవల కాలంలో టీవీల్లో షార్ట్స్ వీడియోలు చూసే వారి సంఖ్య పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో టీవీల్లో షార్ట్స్ చూసేవారి సంఖ్య ఏకంగా రెండు రెట్లయ్యిందట.

ఎప్పుడు ఈ మార్పులు అమల్లోకి వస్తాయో గూగుల్ ఇంకా ప్రకటించలేదు. అయితే, త్వరలోనే ఇవి ప్రారంభమవుతాయని మాత్రం పేర్కొంది.

ఇదిలా ఉంటే.. యూట్యూబ్ ఇప్పటికే ఈక్యాప్-2023 ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్ల ఇష్టాఇష్టాలు, టాప్ ఆర్టిస్టులు, సాంగ్స్, జానర్స్ వంటివన్నీ అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్ మ్యూజిక్ ద్వారా యూజర్లు ఈ ఫీచర్‌ను పరిశీలించవచ్చు.

Mustard Oil: మనం ఇష్టంగా తినే ఆవనూనె..ఒకేఒక్క కారణంతో అమెరికాలో నిషేధం.. ఆవనూనెతో ఇంతటి ప్రమాదమా?

Updated Date - Dec 15 , 2023 | 04:19 PM