Suraj Randiv : నాడు క్రికెటర్‌.. నేడు బస్‌ డ్రైవర్‌

ABN , First Publish Date - 2023-06-20T03:05:08+05:30 IST

క్రికెట్‌.. దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఈ గేమ్‌ ఎందరో ఆటగాళ్లకు కల్పతరువుగా మారింది. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన క్రికెటర్లను ధనికులుగా మార్చింది. అంతర్జాతీయ టోర్నీలే కాదు.. కనీసం

 Suraj Randiv : నాడు క్రికెటర్‌.. నేడు బస్‌ డ్రైవర్‌

శ్రీలంక మాజీ ఆటగాడి దుస్థితి

కొలంబో: క్రికెట్‌.. దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఈ గేమ్‌ ఎందరో ఆటగాళ్లకు కల్పతరువుగా మారింది. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన క్రికెటర్లను ధనికులుగా మార్చింది. అంతర్జాతీయ టోర్నీలే కాదు.. కనీసం రంజీల్లో రాణించినా డబ్బుకు డబ్బుతో పాటు విలాసవంతమైన జీవితాన్ని అందిస్తుంది. కానీ, అన్ని దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండదు. కొందరు క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నా వాళ్లకు ఒరిగేదేమీ ఉండదు. అందుకు నిదర్శనమే శ్రీలంక మాజీ స్పిన్నర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ ఆటగాడు సూరజ్‌ రణ్‌దివ్‌. 36 ఏళ్ల సూరజ్‌ గతంలో శ్రీలంక క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడు. 2011 ప్రపంచక్‌పలోనూ ఆడాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో లంక తరఫున 9 ఓవర్లు బౌలింగ్‌ చేసి 43 పరుగులిచ్చాడు. అదే ఏడాది ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సూరజ్‌.. 8 మ్యాచ్‌లాడి 6 వికెట్లు కూడా తీశాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సూరజ్‌.. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోని ట్రాన్స్‌డేవ్‌ అనే కంపెనీకి బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ చింతక జయసింఘే, జింబాబ్వే మాజీ క్రికెటర్‌ వాడింగ్టన్‌ మేంగ్వా కూడా అదే కంపెనీలో డ్రైవర్లుగా కాలం వెళ్లదీస్తుండడం గమనార్హం. డ్రైవర్‌గా పనిచేస్తూనే డబ్బుల కోసం అప్పుడప్పుడు ఆస్ట్రేలియా క్లబ్‌కు ఆడే సూరజ్‌.. ఈ ఏడాది జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు నెట్‌బౌలర్‌గానూ వ్యవహరించాడు. సూరజ్‌ శ్రీలంక తరఫున 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.

Updated Date - 2023-06-20T03:05:08+05:30 IST