అదితి.. అదరహో
ABN , First Publish Date - 2023-06-15T00:44:16+05:30 IST
మహారాష్ట్రకు చెందిన టీనేజ్ ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి అండర్-18 వరల్డ్ రికార్డు బద్దలుగొట్టింది. మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్
మహారాష్ట్రకు చెందిన టీనేజ్ ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి అండర్-18 వరల్డ్ రికార్డు బద్దలుగొట్టింది. మహిళల వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్‌లో.. 16 ఏళ్ల అదితి 720 పాయింట్లకు గాను 711 పాయింట్లతో కొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో మే నెలలో.. అమెరికాకు చెందిన లికో అరోలా (705 పాయింట్లు) నమోదు చేసిన రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. అదితి క్వాలిఫికేషన్‌లో టాప్‌లో నిలవగా..జ్యోతి సురేఖ రెండో స్థానంలో నిలిచింది.