శాట్స్ చైర్మన్‌గా ఆంజనేయ గౌడ్
ABN , First Publish Date - 2023-01-03T00:19:01+05:30 IST
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన చైర్మన్‌గా డాక్టర్ ఇ. ఆంజనేయ గౌడ్ నియమితులయ్యారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన చైర్మన్‌గా డాక్టర్ ఇ. ఆంజనేయ గౌడ్ నియమితులయ్యారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను ఆంజనేయ అందుకున్నారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. గద్వాల్‌కు చెందిన ఆంజనేయ గతంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు.