Arjun Tendulkar: ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చిన అర్జున్.. కానీ, ఆ వికెట్ మాత్రం హైలెట్!

ABN , First Publish Date - 2023-04-23T08:36:23+05:30 IST

అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్‌పై 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ లెవన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడింది.

Arjun Tendulkar: ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చిన అర్జున్.. కానీ, ఆ వికెట్ మాత్రం హైలెట్!

అభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్‌పై (MI) 13 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ లెవన్ (PBKS) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడింది. 10 ఓవర్లకు 83 పరుగులు మాత్రమే చేసింది. అలాంటి టీమ్ 20 ఓవర్లు ముగిసే సరికి 214 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరి 5 ఓవర్లలో పంజాబ్ టీమ్ ఏకంగా 96 పరుగులు చేసి ముంబై బౌలర్లను వణికించింది.

శామ్ కర్రన్ (Sam Curran) (29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 55) తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు హర్‌ప్రీత్‌ సింగ్‌ (41), జితేశ్‌ శర్మ (7 బంతుల్లో 4 సిక్సర్లతో 25) తోడు కావడంతో పంజాబ్ స్కోరు బోర్డు పరుగెత్తింది. అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వేసిన 16వ ఓవర్‌తో పంజాబ్ గేరు మార్చింది. ఆ ఓవర్లో సామ్‌ కర్రన్‌ (6,4 ), హర్‌ప్రీత్‌ (4,6,4,4) 31 పరుగులు పిండుకున్నారు. ఇందులో ఓ నోబ్‌, వైడ్‌ కూడా ఉండడం గమనార్హం. పదేపదే ఆఫ్‌సైడ్‌ ఆవల బంతులేసిన అర్జున్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఓవర్‌ ఇచ్చిన విశ్వాసంతో ఆ తర్వాత పంజాబ్‌ స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది.

Arshdeep Singh: వామ్మో.. అంత వేగం ఏంటి బాసూ.. అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన వికెట్లు.. వీడియో వైరల్!

తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకునే ప్రదర్శనే చేసిన అర్జున్ ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. అయితే ప్రభుసిమ్రాన్ సింగ్‌ను (Prabhsimran Singh) అర్జున్ అవుట్ చేసిన విధానం మాత్రం చాలా మందిని ఆకట్టుకుంది. 26 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన ప్రభుసిమ్రాన్ సింగ్‌ను స్వింగింగ్ యార్కర్‌తో అర్జున్ అవుట్ చేశాడు. అంపైర్ నిర్ణయంపై ప్రభుసిమ్రాన్ సింగ్ డీఆర్‌ఎస్ కోరాడు. అయితే రీప్లేలో ప్రభుసిమ్రాన్ సింగ్ అవుటైనట్టు స్పష్టంగా కనిపించింది.

Updated Date - 2023-04-23T08:36:23+05:30 IST