Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ చూశారా? సచిన్ ఏమని ట్వీట్ చేశాడంటే..

ABN , First Publish Date - 2023-04-19T10:58:02+05:30 IST

ఈ ఐపీఎల్‌ను పేలవంగా ప్రారంభించిన ముంబై ఇండియన్స్ టీమ్ ఆ తర్వాత కుదురుకుని తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తోంది. హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ చూశారా? సచిన్ ఏమని ట్వీట్ చేశాడంటే..

ఈ ఐపీఎల్‌ను (IPL 2023) పేలవంగా ప్రారంభించిన ముంబై ఇండియన్స్ టీమ్ (MI) ఆ తర్వాత కుదురుకుని తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తోంది. హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (MIvsSRH) అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. సన్‌రైజర్స్‌పై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమైన దశలో అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) చక్కగా బౌలింగ్ చేశాడు.

193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (48) మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో మ్యాచ్‌లో పూర్తిగా ముంబై ఆధిపత్యం కొనసాగింది. చివరి ఓవర్లో 20 పరుగులు చేస్తే సన్‌రైజర్స్‌కు విజయం అనే దశలో బంతి అర్జున్ టెండూల్కర్ చేతిలోకి వెళ్లింది. ఆ ఓవర్లో అర్జున్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా భువనేశ్వర్‌ను (Arjun Tendulkar got maiden ipl wicket) అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో అర్జున్‌కు ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో మొత్తం 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 18 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు.

Sachin with Lara: దిగ్గజ ఆటగాళ్ల కలయిక.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న అభిమానులు!

మ్యాచ్ అనంతరం ముంబై టీమ్‌ను మెచ్చుకుంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ట్వీట్ చేశాడు. ``మరోసారి ముంబై టీమ్ ఆల్-రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కామరూన్ గ్రీన్ బ్యాట్, బంతితో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగానే ఇషాన్, తిలక్ బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ రోజురోజుకూ మరింత ఆసక్తిగా మారుతోంది. చివరగా అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ సాధించాడ``ని సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-04-19T16:49:35+05:30 IST