అర్జున్..రన్నరప్
ABN , Publish Date - Dec 22 , 2023 | 04:16 AM
తెలుగు ఆటగాడు ఇరిగేసి అర్జున్ త్రుటిలో చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను కోల్పోయాడు. స్థానిక స్టార్ గుకేష్ టైటిల్ గెలిచాడు...
చెన్నై చెస్ విజేత గుకేష్
హరికి మూడో స్థానం
చెన్నై: తెలుగు ఆటగాడు ఇరిగేసి అర్జున్ త్రుటిలో చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను కోల్పోయాడు. స్థానిక స్టార్ గుకేష్ టైటిల్ గెలిచాడు. గురువారం జరిగిన ఆఖరి రౌండ్లో గుకే్‌షతో గేమ్‌ను పెంటేల హరికృష్ణ డ్రా చేసుకోగా, సనన్ సుజుగిరోవ్ (హంగేరి)పై అర్జున్ గెలిచాడు. దీంతో టోర్నీలో మొత్తం ఏడురౌండ్లు పూర్తయ్యేసరికి గుకేష్, అర్జున్ 4.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే, మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేష్ విజేతగా నిలవగా.. అర్జున్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 4 పాయింట్లతో హరికృష్ణ మూడో స్థానంలో నిలిచాడు.