Arshdeep Singh: వామ్మో.. అంత వేగం ఏంటి బాసూ.. అర్ష్‌దీప్ దెబ్బకు విరిగిన వికెట్లు.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2023-04-23T08:17:56+05:30 IST
ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పోటీపడి మరీ పరుగులు చేశారు. అయితే బ్యాట్స్‌మెన్ అంతగా ఆధిపత్యం వహించిన మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ బంతితో నిప్పులు చెరిగాడు.
ముంబైలోని (Mumbai) వాంఖడే స్టేడియంలో శనివారం ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ లెవెన్ (PBKS) మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పోటీపడి మరీ పరుగులు చేశారు. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించారు. బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే బ్యాట్స్‌మెన్ అంతగా ఆధిపత్యం వహించిన మ్యాచ్‌లోనూ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) బంతితో నిప్పులు చెరిగాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై విజయాన్ని అందుకున్నాడు. చివరి ఓవర్లో అర్ష్‌దీప్ ధాటికి వికెట్లు విరిగిపోయాయి (Arshdeep Singh Breaks Stumps). పంజాబ్‌ను విజయం వరించింది.
చివరి మూడు ఓవర్లలో 40 పరుగుల చేయాల్సిన దశలో 18వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకర సూర్యకుమార్ యాదవ్‌ను (Surya Kumar Yadav) ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో ముంబై 15 పరుగులు చేయగలిగింది. ఇక, చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో తిలక్ వర్మ, వధేరాలు ఉండడంతో ముంబై గెలుస్తుందనిపించింది. అయితే ఆ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ నిప్పులు చెరిగాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి తిలక్ వర్మ, వధేరాలను బౌల్డ్ చేశాడు.
CSKvsSRH: పాపం.. రుతురాజ్ గైక్వాడ్ బ్యాడ్‌లక్.. మంచి స్వింగ్‌లో ఉండగా ఎలా అవుటయ్యాడో చూడండి..
అర్ష్‌దీప్ యార్కర్ల ధాటికి ఆ రెండు సార్లూ వికెట్లు విరిగిపోయాయి. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ముంబైపై 13 పరుగులతో పంజాబ్ నెగ్గింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులెత్తించిన శామ్ కర్రన్ (Sam Curran) (29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 55) ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.