Badminton Asia Championships: దశాబ్దాల తర్వాత భారత్ సంచలనం.. సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీకి గోల్డ్!
ABN , First Publish Date - 2023-04-30T20:52:43+05:30 IST
దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్(Badminton Asia
న్యూఢిల్లీ: దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్(Badminton Asia Championships)లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy)-చిరాగ్ శెట్టి (Chirag Shetty ) జోడి సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్ నసర్ క్లబ్‌లో షేక్ రషీద్ బిన్ హమ్దాన్ ఇండోర్ హాల్‌లో జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 8 ర్యాంకర్లయిన మలేసియాకు చెందిన యెన్ సిన్-టెయో ఈ యి జంటపై ప్రపంచ నంబర్ 6 జోడీ అయిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి చారిత్రక విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం పతకం. అంతకుముందు 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. చారిత్రక విజయం సాధించిన ఈ జోడీపై భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ జోడీకి రూ. 20 లక్షల ప్రైజ్‌మనీని ప్రకటించారు.