అమన్‌కు కాంస్యం
ABN , First Publish Date - 2023-02-03T03:04:42+05:30 IST
జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో భారత ఆటగాడు అమన్ షెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. 57 కిలోల కాంస్య పోరులో 17 ఏళ్ల అమన్ 10-4తో జేన్ రే రోడ్స్ రిచర్డ్స్ (అమెరికా)ను ఓడించాడు.
జాగ్రెబ్ (క్రొయేషియా): జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో భారత ఆటగాడు అమన్ షెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. 57 కిలోల కాంస్య పోరులో 17 ఏళ్ల అమన్ 10-4తో జేన్ రే రోడ్స్ రిచర్డ్స్ (అమెరికా)ను ఓడించాడు. సెమీ్‌సలో యోటో నిషుచి (జపాన్) చేతిలో అమన్ పరాజయం పాలయ్యాడు. కానీ యోటో ఫైనల్ చేరడంతో షెహ్రావత్‌కు రెపిచేజ్ రౌండ్ ఆడే అవకాశం దక్కింది. మహిళల 50 కిలోల్లో శివానీ పవార్ క్వార్టర్స్‌లో ఓడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యతో విభేదాల కారణంగా టాప్ రెజ్లర్లు బజరంగ్, వినేష్ ఫొగట్, రవి దహియా తదితరులు ఈ టోర్నీకి దూరమయ్యారు.