బుమ్రా వచ్చేశాడు..

ABN , First Publish Date - 2023-01-04T00:15:41+05:30 IST

గాయంతో సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు.

బుమ్రా వచ్చేశాడు..

న్యూఢిల్లీ: గాయంతో సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. ఈమేరకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. వెన్నునొప్పి కారణంగా గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడు. చివరిసారి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీ్‌సలో ఆడాడు. మరోవైపు వన్డే వరల్డ్‌క్‌పను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది బుమ్రాను పొట్టి ఫార్మాట్‌లో ఆడించకపోవచ్చని సమాచారం.

Updated Date - 2023-01-04T00:15:55+05:30 IST