IPL 2023: హైదరాబాద్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం!
ABN , First Publish Date - 2023-03-30T20:27:56+05:30 IST
ఐపీఎల్(IPL 2023) ప్రారంభ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabd) జట్టుకు
హైదరాబాద్: ఐపీఎల్(IPL 2023) ప్రారంభ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabd) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా ఆటగాడు, ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ అయిడెన్ మార్కరమ్( Aiden Markram) జాతీయ జట్టుతో బిజీగా ఉండడంతో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో టీమిండియా వెటరన్ సీమర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) జట్టును నడిపించనున్నాడు.
గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ కాబోతోంది. ఆదివారం (ఏప్రిల్ 2) సన్‌రైజర్స్ హైదరాబాద్ హోంగ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ప్రస్తుతం నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. సఫారీలతో రెండు రీషెడ్యూల్డ్ వన్డేలు ఆడబోతోంది. తొలి వన్డే శుక్రవారం, రెండో వన్డే ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఐపీఎల్‌తో తమ జట్టు ఆడే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. రెండో వన్డే ముగిసిన తర్వాత ఏప్రిల్ 3న భారత్ చేరుకుంటాడు. ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో జరిగే మ్యాచ్‌కు మార్కరమ్ అందుబాటులో ఉంటాడు.
నెదర్లాండ్స్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు ఎంతో కీలకం. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించడంలో దక్షిణాఫ్రికాకు ఈ సిరీస్ అత్యంత ముఖ్యమైనది. 33 ఏళ్ల భువనేశ్వర్ 2013 నుంచి ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. 2019లో ఆరు మ్యాచ్‌లకు, 2022లో ఒక మ్యాచ్‌కు సారథ్యం కూడా వహించాడు. అయితే, వీటిలో రెండింటిలో మాత్రమే ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించింది.