IND vs WI 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. ఆ 17 ఏళ్ల రికార్డ్‌కి బ్రేక్ వేస్తుందా?

ABN , First Publish Date - 2023-08-01T18:51:12+05:30 IST

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో నేడు మూడో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగనుంది...

IND vs WI 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. ఆ 17 ఏళ్ల రికార్డ్‌కి బ్రేక్ వేస్తుందా?

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో నేడు మూడో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని రెండో మ్యాచ్ పూర్తిగా బెడిసికొట్టింది కాబట్టి.. ఈ సిరీస్‌లో తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో మ్యాచ్ కోసం ఆ ఇద్దరిని జట్టులోకి తిరిగి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ.. ఈసారి కూడా అనుభవజ్ఞులైన ఆ ఇద్దరు ఆటగాళ్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో.. వాళ్లు లేకుండా భారత జట్టు మూడో మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ జట్టులో రెండు మార్పులు చేశారు. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో జయదేవ్ ఉనాద్కట్, అక్షర్ పటేల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని ఎంపిక చేశారు.


ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగ్గా.. ఇరు జట్లు చెరో విజయాన్ని నమోదు చేశాయి. ఇప్పుడిది చివరి మ్యాచ్ కాబట్టి.. రెండు జట్లు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరు గెలుస్తారో, వారిదే సిరీస్ సొంతం అవుతుంది కాబట్టి.. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గాలన్న లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే.. గత 17 ఏళ్ల నుంచి వెస్టిండీస్ చేతిలో భారత జట్టు సిరీస్ ఓడిపోలేదు. వారిపై 17 సంవత్సరాల నుంచి విజయ పరంపరని కొనసాగిస్తూ వస్తోంది. మరి.. ఆ పరంపరని టీమిండియా కొనసాగిస్తుందా? లేక వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి, అందుకు బ్రేక్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - 2023-08-01T18:58:23+05:30 IST