IND vs AUS: సన్నగిల్లుతున్న ఆశలు.. మెల్లమెల్లగా ఖాళీ అవుతున్న స్టేడియం
ABN , First Publish Date - 2023-11-19T20:22:50+05:30 IST
వరల్డ్ కప్ 2023లో మన భారతీయ బౌలర్లు అద్భుత కనబరచడంతో.. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. వికెట్ల మీద వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాని మట్టికరిపిస్తారని భావించారు. ఆ అంచనాలకి తగినట్టుగానే మొదట్లో...
వరల్డ్ కప్ 2023లో మన భారతీయ బౌలర్లు అద్భుత కనబరచడంతో.. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు. వికెట్ల మీద వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాని మట్టికరిపిస్తారని భావించారు. ఆ అంచనాలకి తగినట్టుగానే మొదట్లో మూడు వికెట్లు వెనువెంటనే పడ్డాయి. 47 పరుగులకే ఆస్ట్రేలియా 3 ప్రధాన వికెట్లను కోల్పోయింది. బుమ్రా రెండు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ పడగొట్టి మ్యాచ్‌ని మలుపు తిప్పేశారు. ఇది చూసి.. భారత్ గెలుపు ఖాయమని అందరూ ఫిక్సైపోయారు. తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియాని మన బౌలర్లు కట్టడి చేస్తారని, తప్పకుండా భారత్‌ని గెలిపిస్తారన్న నమ్మకాలు ఏర్పడ్డాయి.
కానీ.. ఇప్పుడు ఆ ఆశలు సన్నగిల్లుగుతున్నాయి. దాదాపు ఈ మ్యాచ్ భారత్ నుంచి చేజారినట్లే కనిపిస్తోంది. మరో వికెట్ తీసేందుకు మన భారత బౌలర్లు నానాతంటాలు పడుతున్నారు. ట్రావిస్ హెడ్ అర్థశతకం పూర్తి చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా.. లబుషేన్ అతనికి మంచి స్టాండ్ ఇస్తున్నాడు. ఎంతో తెలివిగా భారత బౌలర్లను ఎదుర్కొంటూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నారు. వీరిని ఔట్ చేసేందుకు రోహిత్ శర్మ ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా, బౌలర్లను క్రమంగా మారుస్తున్నా.. ఫలితం లేకుండా పోతోంది. వీళ్లిద్దరు భారత బౌలర్లకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా.. ఎంతో నిలకడగా రాణిస్తున్నారు. నాలుగో వికెట్‌కి వీళ్లు ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ ఇప్పుడు ఆస్ట్రేలియా వైపుకు మళ్లింది.
ఈ విషయం పసిగట్టిన భారత క్రీడాభిమానులు.. మెల్లగా మైదానం వీడి వెళ్లిపోతున్నారు. టీమిండియా గెలిచే పరిస్థితులు అంతంత కనిపించకపోవడంతో.. నిరాశ నిస్పృహలతో మైదానం వెళ్లి, ఇంటి బాట పట్టారు. ఇతరులు తమవంతు మద్దతు తెలుపుతూ టీమిండియా ప్లేయర్లలో జోష్ నింపేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. నమ్మకం లేని వాళ్లు మాత్రం ఇంటికి వెళ్లిపోతున్నారు. ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకొని వచ్చిన ఫ్యాన్స్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేకపోయారు.