IPL 2023: అట్టడుగు జట్ల మధ్య పోరు.. టాస్ గెలిచిన ఢిల్లీ

ABN , First Publish Date - 2023-04-24T19:15:24+05:30 IST

పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగబోతోంది. ఆ

IPL 2023: అట్టడుగు జట్ల మధ్య పోరు.. టాస్ గెలిచిన ఢిల్లీ

హైదరాబాద్: పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగబోతోంది. ఆ రెండు జట్లు మరేవో కాదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), ఢిల్లీ కేపిటల్స్(DC). ఈ రెండు జట్లు ఇప్పటి వరకు చెరో ఆరేసి మ్యాచ్‌లు ఆడాయి. హైదరాబాద్ రెండు విజయాలు సాధించి కింది నుంచి రెండో స్థానంలో ఉంటే, ఢిల్లీ ఒకే ఒక్క గెలుపుతో అట్టడుగున నిలిచింది. కాబట్టి లీగ్‌లో తమ ఉనికి కాపాడుకోవాలంటే రెండు జట్లకు గెలుపు ఎంతో ముఖ్యం.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ వార్నర్(David Warner) మరోమాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ తమ మూడో గెలుపు కోసం ఎదురుచూస్తుండగా, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి జట్టును గెలుపు బాట పట్టించాలని ఢిల్లీ కెప్టెన్ వార్నర్ పట్టుదలగా ఉన్నాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో సాధించిన విజయం ఇచ్చిన ఊపును కొనసాగించాలని కంకణం కట్టుకున్నాడు. తద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెప్పాలని భావిస్తున్నాడు.

Updated Date - 2023-04-24T19:15:24+05:30 IST