IPL 2023: ఆలస్యంగా ప్రారంభమైన ఢిల్లీ-కోల్‌కతా మ్యాచ్.. రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్

ABN , First Publish Date - 2023-04-20T20:59:44+05:30 IST

వర్షం కారణంగా ఆలస్యమైన ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)-కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్

IPL 2023: ఆలస్యంగా ప్రారంభమైన ఢిల్లీ-కోల్‌కతా మ్యాచ్.. రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్

ఢిల్లీ: వర్షం కారణంగా ఆలస్యమైన ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)-కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్(Delhi) ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు దింపింది. కేకేఆర్‌(Kolkata)కు ఆరంభం కలిసి రాలేదు. ఓపెనర్ లిటన్ దాస్(4) రెండో ఓవర్ చివరి బంతికి 15 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే వెంకటేశ్ అయ్యర్ డకౌట్ అయ్యాడు.

ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిశాయి. కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 19, కెప్టెన్ నితీశ్ రాణా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, వర్షం కారణంగా 7 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. అయినప్పటికీ ఓవర్లలో ఎలాంటి కుదింపు లేదు.

Updated Date - 2023-04-20T20:59:44+05:30 IST