IPL 2023: బెంగళూరుకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం

ABN , First Publish Date - 2023-04-04T17:33:46+05:30 IST

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఆరంభంలోనే

 IPL 2023: బెంగళూరుకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం

బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఆరంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రజత్ పటీదార్(Rajat Patidar) గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఆర్సీబీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)కు ఆడిన రజత్ 8 మ్యాచుల్లో 333 పరుగులు చేశాడు. గత సీజన్ ప్లే ఆఫ్స్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. దేశవాళీ సీజన్‌లో మధ్యప్రదేశ్‌కు ఆడుతున్న పటీదార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

అచిల్లిస్ హీల్ ఇంజ్యూరీతో బాధపడుతున్న రజత్ పటీదార్ దురదృష్టవశాత్తు ఐపీఎల్ 2023కి దూరమైనట్టు ఆర్సీబీ తెలిపింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆంకాక్షించింది. రజత్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఇప్పుడే ఎంపిక చేయకూడదని కోచ్‌లు, మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్టు పేర్కొంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ పటీదార్ స్థానంలో దినేశ్ కార్తీక్‌ను బరిలోకి దింపింది. ఆ మ్యాచ్‌లో కార్తీక్ మూడు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. పటీదార్ లేకపోవడంతో టాపార్డర్‌లో ఆర్సీబీ ఫైర్ పవర్‌కు కొంత దెబ్బే. పటీదార్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆర్సీబీకి ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఇండియన్ ఆటగాళ్లు అనూజ్ రావత్(Anuj Rawat), సుయాష్ ప్రభుదేశాయ్(Suyash Prabhudessai) మాత్రమే ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2023-04-04T17:37:04+05:30 IST