IPL 2023: ఢిల్లీ-కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. పడని టాస్

ABN , First Publish Date - 2023-04-20T19:10:44+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)-కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య

IPL 2023: ఢిల్లీ-కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. పడని టాస్

ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)-కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. చినుకులు పడుతుండడంతో టాస్ ఆలస్యమైంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓడిన ఢిల్లీ(Delhi) ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలని చూస్తుండగా, ఐదు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించిన కోల్‌కతా(Kolkata) ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తోంది. కాగా, మైదానంపై మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో చూస్తుంటే మ్యాచ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

Updated Date - 2023-04-20T19:10:49+05:30 IST