IPL 2023: జేసన్ రాయ్‌కు జరిమానా?.. ఎందుకో తెలుసా?
ABN , First Publish Date - 2023-04-27T17:26:21+05:30 IST
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ (IPL 2023) నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ (Jason Roy)కు జరిమానా పడింది. 29
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ (IPL 2023) నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ (Jason Roy)కు జరిమానా పడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన జేసన్ రాయ్.. బెంగళూరు బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్ బౌలింగులో అవుటయ్యాడు. అయితే, దీనిని జీర్ణించుకోలేకపోయిన రాయ్.. ఆగ్రహంతో బెయిల్స్‌లో ఒకదానిని కొట్టాడు. అతడి ప్రవర్తనను ‘లెవన్ 1’ నేరంగా పరిగణించిన ఐపీఎల్ జేసన్ రాయ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌కు ఇది మూడో విజయం. నాలుగు వరుస ఓటముల తర్వాత ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్ ఈ మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో పదో ఓవర్ వేసిన వైశాఖ్ చివరి బంతికి రాయ్‌ను బౌల్డ్ చేశారు. అవుట్ కావడంతో తట్టుకోలేకపోయిన రాయ్ తన కోపాన్ని బెయిల్‌పై చూపించాడు. ఫలితంగా జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది.