Vyshak Vijaykumar: తొలి మ్యాచ్‌లోనే రికార్డు పట్టేశాడు!

ABN , First Publish Date - 2023-04-15T21:00:52+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో

Vyshak Vijaykumar: తొలి మ్యాచ్‌లోనే రికార్డు పట్టేశాడు!

బెంగళూరు: ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలపడిన ఢిల్లీ వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైశాఖ్ విజయ్ కుమార్()Vyshak Vijaykumar అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసి 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బెంగళూరు బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated Date - 2023-04-15T21:00:52+05:30 IST