Mohammed Shami: నాకు ఎక్కువ అవకాశాలు రాలేదు.. ఇప్పుడు నా టైమ్ స్టార్ అయింది.. వరల్డ్ కప్ హీరో షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ABN , First Publish Date - 2023-11-17T17:30:16+05:30 IST
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.. హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తీసుకున్నారు.. అంతే.. తనను పక్కన పెట్టడం ఎంత తప్పిదమో మేనేజ్‌మెంట్‌కు అర్థమయ్యేలా చెలరేగిపోయాడు.. అతడు మరెవరో కాదు.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా స్ట్రైక్ బౌలర్ మహ్మద్ షమీ.
మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు.. రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.. హార్దిక్ పాండ్యాకు గాయం కావడంతో ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తీసుకున్నారు.. అంతే.. తనను పక్కన పెట్టడం ఎంత తప్పిదమో మేనేజ్‌మెంట్‌కు అర్థమయ్యేలా చెలరేగిపోయాడు.. అతడు మరెవరో కాదు.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా స్ట్రైక్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami). ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన షమీ మొత్తం 23 వికెట్లను తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్ (World Cup2023)లో తన ప్రదర్శనపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు (India vs New Zealand).
``నేను వన్డే క్రికెట్ చాలా తక్కువగా ఆడాను. వైట్ బాల్ క్రికెట్‌లో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, ఎప్పుడూ అవకాశం వచ్చినా నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నా. మంచి అవకాశం కోసం వేచి చూశా. ధర్మశాల (న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్) నుంచి నా టర్న్ స్టార్ట్ అయింద``ని షమీ వ్యాఖ్యానించాడు. అలాగే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ (Kane Williamson) క్యాచ్ వదిలే క్యాచ్ వదిలేసినపుడు చాలా బాధపడ్డానని షమీ పేర్కొన్నాడు.
World Cup2023: పెళ్లి తర్వాతైనా చూడొచ్చు.. ముందు మ్యాచ్ చూడాలి.. పెళ్లి వేడుకలో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
``పిచ్‌పై తేమ ప్రభావం ఉంటుందని మేం భయపడ్డాం. అలాంటి సమయంలో స్లో బాల్స్ వేసినా ఉపయోగం ఉండదు. అందుకే ప్రాథమిక నిబంధనలకు కట్టుబడి బౌలింగ్ చేశా. నాదైన శైలిలోనే బంతులు విసిరాను. గత రెండు టోర్నీల్లో మేం సెమీ ఫైనల్స్‌లోనే ఓడిపోయాం. ఈసారి మాత్రం వదలకూడదనుకున్నాం. ఇలాంటి అవకాశం మళ్లీ రాదనే ఆలోచనలోనే అందరూ ఉన్నార`ని షమీ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన షమీ ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు గెలుచుకున్నాడు.