Home » CricketWorldCup2023
ఇప్పటికే విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ సీజన్‌లో సీఎస్కే తమ తర్వాతి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.
ఇటివల పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఫైనల్ 2024 మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా డ్రెస్సింగ్ రూమ్(dressing room)లోనే మాజీ పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్(Imad Wasim) సిగరెట్ తాగుతూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమవడం టీమిండియాకే కాకుండా ప్రపంచ క్రికెట్ కూడా పెద్ద ఎదురుదెబ్బ అని మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. గత 15 ఏళ్లకు పైగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడని, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి అతను అర్హుడని చెప్పాడు.
2023 సంవత్సరం ముగింపునకు రోజులు మాత్రమే మిగిలాయి. చూస్తుండగానే 12 నెలలు గడిచిపోయాయి. ఇక 2024 సంవత్సరానికి స్వాగతం పలకడమే మిగిలి ఉంది. క్రికెట్ పరంగా ఈ ఏడాది అనేక అరుదైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టైమ్‌డ్ ఔట్ వివాదం.
సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. అద్భుత ఆట తీరుతో ఫైనల్ చేరిన టీమిండియా తుది మెట్టుపై మాత్రం బోల్తాపడింది. ఫైనల్ పోరులో ఓడి రన్నరఫ్‌తోనే సరిపెట్టుకుంది. దీంతో టీమిండియా ఆటగాళ్లతోపాటు కోట్లాది మంది అభిమానుల గుండెలు పగిలాయి.
Cricket: క్రికెట్ ప్రపంచ కప్(Cricket World Cup - 2023) లో భారత్ ఓటమిపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్(Akilesh Yadav) యాదవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ప్రపంచ కప్ ఫైనల్(World Cup 2023) లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పశ్చిమ బెంగాల్(West Bengal) లో ఓ యువకుడు భారత్ ఓటమి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు.
ODI World Cup 2023 అవును.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి..! వరల్డ్ కప్ మనదే అనుకున్న దేశ ప్రజలు ఇండియా ఓడిపోయిందనే విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శనతో ఆసిస్‌పై ఓటమిపాలయ్యింది...
గత నెలన్నరగా ప్రపంచకప్ ఫీవర్ అందరినీ ఆవహించేసింది. టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ చేరడంతో ఆ జోష్ మరింత పెరిగింది. ఈ రోజు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడుతోంది. ఫైనల్ మ్యాచ్ కావడం, అందులోనూ ఆదివారం కావడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు.
సిద్దిపేట(Siddipet)లోని ఓ ఫంక్షన్ హాళ్లో ఇవాళ జంట వివాహం జరిగింది. వరుడు, వధువుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పైగా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఉంది. మెడలో మూడు ముడులు వేయగానే అక్కడే ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో భారత్ స్కోర్ చూడటానికి వధువు, వరుడు పరిగెత్తుకుంటూ కిందకు వచ్చారు.