ఇంగ్లండ్‌ 325/9 డిక్లేర్‌

ABN , First Publish Date - 2023-02-17T01:05:19+05:30 IST

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చెలరేగింది. గురువారం తొలి రోజు ఆటలోనే 9 వికెట్లకు 325 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌  325/9 డిక్లేర్‌

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ చెలరేగింది. గురువారం తొలి రోజు ఆటలోనే 9 వికెట్లకు 325 పరుగులు చేసింది. బ్రూక్‌ (89), ఓపెనర్‌ డకెట్‌ (84), పోప్‌ (42) రాణించారు. వాగ్నర్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే మరో వికెట్‌ చేతిలో ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి కివీ్‌సను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం విశేషం. వికెట్‌పై పగుళ్లను కొత్త బంతితో సద్వినియోగం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. వారు ఆశించినట్టుగానే కివీస్‌ ఆట ముగిసేసరికి 18 ఓవర్లలో 37/3 స్కోరుతో కష్టాల్లో పడింది.

Updated Date - 2023-02-17T01:05:20+05:30 IST