Sachin with Lara: దిగ్గజ ఆటగాళ్ల కలయిక.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న అభిమానులు!

ABN , First Publish Date - 2023-04-19T10:30:22+05:30 IST

ఒక తరం మొత్తాన్ని తమ అద్భుత బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా. వీరి బ్యాటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.

Sachin with Lara: దిగ్గజ ఆటగాళ్ల కలయిక.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న అభిమానులు!

ఒక తరం మొత్తాన్ని తమ అద్భుత బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), బ్రియాన్ లారా (Brian Lara). వీరి బ్యాటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. పరుగులు, ప్రతిభ విషయంలో పోటీ పడిన సచిన్, లారా బయట మాత్రం మంచి స్నేహితులు. లారా ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (SRH) బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ (MI) టీమ్‌కు సచిన్ మెంటార్‌గా ఉన్నాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్, ముంబై టీమ్‌ల మధ్య ఐపీఎల్ (IPL 2023) మ్యాచ్ జరిగింది (SRHvsMI).

మ్యాచ్‌కు ముందు వీరిద్దరూ మైదానంలో కలిసి మాట్లాడుకున్నారు. క్రికెట్ ఐకాన్లుగా నిలిచిన ఇద్దరు దిగ్గజాలు మైదానంలో చేతులు కులుపుకుని సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. స్టేడియంలో కూడా ప్రేక్షకులు వారిద్దరినీ చూసి సంతోషం వ్యక్తం చేశారు. సచిన్, లారా ఆడే సమయంలో వారి రికార్డుల గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. వన్డేలు, టీ-20లు, టెస్ట్‌ల్లో సచిన్ మొత్తం 34,357 పరుగులు చేశాడు. మరోవైపు వన్డేలు, టెస్ట్‌లో లారా మొత్తం 22,358 పరుగులు చేశాడు.

MIvsRCB: అయోమయంలో అంపైర్.. దానికి కూడా థర్డ్ అంపైర్‌ను అడగాలా అంటూ నెటిజన్లు ఫైర్!

``సచిన్, లారా.. తమ ఆటతో, ప్రవర్తనతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన మేటి ఆటగాళ్లు``, ``గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్``, ``ఇది నిజంగా చాలా గొప్ప సందర్భం``, ``ఇలాంటి ఆటగాళ్లు మళ్లీ దొరకరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-04-19T10:30:22+05:30 IST