Manoj Tiwari: క్రికెట్‌కు మనోజ్‌ తివారీ గుడ్‌బై

ABN , First Publish Date - 2023-08-04T03:40:40+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ (37) కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Manoj Tiwari: క్రికెట్‌కు మనోజ్‌ తివారీ గుడ్‌బై

కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ (37) కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2008-15 మధ్య తివారీ 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2022-23 రంజీ సీజన్‌ సెమీ ఫైనల్‌ అతడి చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌. పశ్చిమ బెంగాల్‌ క్రీడా మంత్రిగా కొనసాగుతూనే రంజీలు ఆడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ప్రతిభ ఉన్నా మనోజ్‌కు అదృష్టం కలసి రాలేదని అంటారు. కీలక సమయాల్లో గాయపడి దూరం కావడంతో అంతర్జాతీయ కెరీర్‌ ఊపందుకోలేదు. దీనికితోడు ధోనీ హయాంలో లెఫ్ట్‌ హ్యాండర్‌ సురేష్‌ రైనాకు ఎక్కువగా అవకాశాలివ్వడం తివారీ పాలిట శాపమైంది.

Updated Date - 2023-08-04T03:40:40+05:30 IST