IPL GT vs CSK : ఎవరిదో శుభారంభం?
ABN , First Publish Date - 2023-03-31T03:06:34+05:30 IST
మరో టైటిల్ కోసం హార్దిక్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్.. ఐదోసారి విజేతగా నిలవాలన్న కసితో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ పోరులో బరిలోకి దిగబోతున్నాయి.
ఆరంభపోరులో గుజరాత్ X చెన్నై
ధోనీకి గాయం
తొలి మ్యాచ్‌కి డౌటే
మరో టైటిల్ కోసం హార్దిక్ నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్.. ఐదోసారి విజేతగా నిలవాలన్న కసితో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ పోరులో బరిలోకి దిగబోతున్నాయి. గత సీజన్‌లో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన సీఎ్‌సకేపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ధోనీకిదే చివరి సీజన్‌గా చెప్పుకొంటున్నారు. జట్టులోని ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్ తమ బ్యాటింగ్ బలాన్ని పెంచుతాడని ఆశిస్తోంది. కాన్వే, మొయిన్ అలీ, జడేజా, రాయుడు కూడా సత్తా చాటితే భారీ స్కోర్లు ఖాయమే. ఆంధ్ర యువ క్రికెటర్ రషీద్‌ను చెన్నై కొనుగోలు చేసింది. బౌలింగ్ నుంచి దీపక్ చాహర్, సిమ్రన్‌జిత్, స్పిన్నర్ తీక్షణ కీలకం కానున్నారు. ప్రాక్టీ్‌సలో ధోనీ ఎడమ మోకాలికి గాయమైందని సమాచారం. అదే జరిగితే కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించే అవకాశం ఉంది. ఇక పాండ్యా టీమ్‌లో ఓపెనర్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి విలియమ్సన్ కూడా చేరాడు. తొలి మ్యాచ్‌కు డేవిడ్ మిల్లర్ దూరం కానుండగా స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో ప్రత్యర్థికి తిప్పలు తప్పవు. పేసర్లు షమి, మావి, అల్జారి జోసెఫ్ కీలకం కానున్నారు.
గాయాలతో అవుటైన ప్లేయర్స్
ఢిల్లీ కెప్టెన్ పంత్, ముంబై స్టార్ పేసర్ బుమ్రా, కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్, పంజాబ్ వికెట్ కీపర్ బెయిర్‌స్టో, రాజస్థాన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, చెన్నై పేసర్ జేమిసన్‌లు ఈ సీజన్‌కు పూర్తిగా దూరం కానున్నారు. అలాగే పటీదార్, హాజిల్‌వుడ్, మ్యాక్స్‌వెల్ (ఆర్‌సీబీ) మాత్రం లీగ్‌లో పలు మ్యాచ్‌లకు దూరమయ్యే చాన్సుంది.
పని భారం పడకుండా..
ఇదే ఏడాది అక్టోబరులో వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. అలాగే లీగ్ ముగిసి న వెంటనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్ జరగాల్సివుంది. అందుకే బీసీసీఐ కీలక ఆటగాళ్లపై అధిక పనిభారంతో పాటు గాయాల బారిన పడకుండా చూడాలనుకుంటోంది. ఇందుకోసం వారిని అన్ని మ్యాచ్‌లను ఆడించకుండా కొంత విశ్రాంతి కల్పిస్తే బావుంటుందని కెప్టెన్ రోహిత్ కూడా చెప్పాడు.